చాలా రోజుల తర్వాత ఆంధ్రాలో కరెంట్ కోత మొదలవుతున్నది. ఏ విషయాన్ని ప్రభుత్వం ప్రకటన చేసింది. గత కొద్ది రోజులుగా అనధికారంగా కరెంట్ కోత విధిస్తున్నారు. దీనితో బాగా విమర్శలు ఎదురయ్యాయి. దీనితో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకు కరెంటు మీద ఎమెర్జెన్సీ లోడ్ రిలీఫ్ అంటూ విజ్ఞప్తి చేసింది. ఏ మేరకు ఒక పోస్టు పబ్లిష్ అయింది. దీని ప్రకారం:
దసరా పండగ తర్వాత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా (పవర్ కట్) ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయి.
పల్లెటూర్లలో సాయంత్రం 6 నుంచి 10 లోపు మూడు గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (పవర్ కట్) ఉంటుంది.
మునిసిపాలిటీలు పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల తర్వాత పవర్ కట్ ఉంటుంది.
పెద్ద నగరాల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు పవర్ కట్ ఉంటుంది.
ప్రభుత్వ వివరణ
*విద్యుత్ కోతలపై సామాజికమాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దు*
-కె.సంతోషరావు, సిఎండి, ఈపిడిసిఎల్
విశాఖపట్నం, అక్టోబర్ 16: విద్యుత్ కోతలపై సామాజికమాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపిడిసిఎల్) వినియోగదారులకు సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు విజ్ఞప్తి చేసారు. దసరా పండగ తర్వాత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా (పవర్ కట్) ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయని సామాజికమాధ్యమాల్లో వస్తున్నట్లు సిఎండి దృష్టికి రావడంతో అటువంటి కోతలేవీ లేవని సిఎండి కె.సంతోషరావు స్పష్టం చేసారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి బొగ్గు నిల్వలను రాష్ట్రప్రభుత్వం సమకూర్చడం వలన విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవని సిఎండి పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎటువంటి సమాచారం ఉన్నా సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా వినియోగదారులకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అధికారకంగా తెలియచేస్తామన్నారు.