’మా‘ ఎన్నికల మీద ఇపుడు బహుజన విశ్లేషణ

 “మా” ఎన్నికల్లో కులం కుట్ర గెల్చింది, ఊహించందే జరిగింది..

“మా”లో చీలిక అనివార్యం,అది చారిత్రక అవసరం కూడా..!!

 

దండి వెంకట్

‘దొంగ నోట్ల దొంగ ఓట్ల పాలనోకపాలన
లంచగొండి వెధవలేలే రాజ్యమొక రాజ్యమా: మహాకవి శ్రీశ్రీ

నకిలీ ఎర్రచొక్క కప్పుకున్నవాడి
రంగు కూడా ప్రపంచం ముందు బయటపడింది..!!!

పైకి మద్దతు లేదంటూనే “మెగా” కుటుంబం బహిరంగంగా మద్దతు ప్రకటించగానే, తన బంధువు మంచు విష్ణు గెలుపు కోసం
కృషి చేసిన ఏలినవారి వర్గం, ఆ సామాజికవర్గానికి చెందిన
ప్రధాన మీడియా ేేయింబగలు కష్టపడింది.

★ ఒక్క ఏకలవ్వుడిని చుట్టుముట్టి  ఎన్నో దుష్ప్రచారాలు,ఎన్నో కుట్రలు జరిగాయి.ఇంతకాలం ఎర్ర ముసుగులో ఉన్న కమ్మ మ్యూనిస్టులదంతా వర్గం ముసుగులో కులం కుట్రలో దాగిన విషయం మళ్ళోసారి “మా” ఎన్నికల సమయంలో ప్రపంచానికి తెలిసిపోయింది.

★ తెలుగు ఆత్మగౌరవమంటున్న ఆధిపత్య దోపిడి కులాల మీడియాకు సినిమా ఇండస్ట్రీలో దళిత బహుజనుల నుడి నిర్మాతలు,నటీనటులు, సాంకేతిక నిపుణులు,హీరోయిన్లు, హీరోలు ఎంతమంది ఉన్నారో చెప్పగలరా..
సినీమాలు చూసేది దళిత బహుజన ప్రజలు సొమ్ములను మూటకట్టుకోని డ్రగ్స్ మాఫియా, క్లబ్బులు,పబ్బుల గబ్బు సంస్కృతిని తెలుగు నేలపై వెదజల్లే ఆధిపత్య దోపిడి కులాలు తీసే సినిమాలను బహిష్కరించే ఒక రోజు వస్తుంది.

★ నకిలీ ఎర్రచొక్కల రంగు బయట పడిపోయింది. వర్గం ముసుగులోదాగిన కుల తత్వవాదుల కుటిల బుద్ధి మాదల రవి లాంటి వారు ఎర్రచొక్క పరువు తీసిన వారు ఇంకా, మాదే ఎర్రజెండా అంటూ ఊరేగుతున్నారు.
ఎందుకంటే విష్ణు ప్యానల్ లో ఉన్న వారు కులాధిపత్య దోపిడి వారసత్వానికి ప్రతినిధులే. ముఖ్యంగా వారంతా రాజకీయంగా బిజెపి భావజాలమున్న ప్యానెల్ వారితో మాదల రవి ఎలా ఉంటారు..? కమ్యూనిస్టు ముసుగులో ఉన్న
అగ్ర కుల కమ్యూనిస్టుల నుండి నిజమైన ఎర్రజెండా వారసత్వాన్ని రక్షించుకోవసిన బాధ్యత బహుజన కమ్యూనిస్టులపై ఉన్నదని “మా”ఎన్నికల్లో స్పష్టంగా తేలిపోయింది.

ఇంకా కొందరు ఉన్నారు మాదీ కమ్యూనిస్టు కుటుంబమే అంటూ ఎర్ర కండువా కప్పుకోని వివిధ సినిమా ఫంక్షన్లలలో సమయం దొరికినప్పుడల్లా డైలాగ్స్ చెప్పేవారు సైతం “మా” ఎన్నికల్లో కుల కంపును బయటపెట్టుకున్నారు. బిజెపి భావజాలమున్న వారంతా బహిరంగంగా
ప్రకాష్ రాజ్ కమ్యూనిస్టు భావజాలమున్నవాడు, దేశభక్తి లేనివాడని కారుకూతలు కూస్తే సినిమా ఇండస్ట్రీలో ఎర్ర గౌరవాన్ని అమ్ముకోని బతికే కమ్మ కమ్యూనిస్టులు ఎందుకు ఎదురు దాడి చేయలేదు..? సినిమా ఇండస్ట్రీలోకి బిజెపి ఏవిధంగా చొరబడిందో బండి సంజయ్ సోషల్ మీడియాలో ట్వీట్ యే నిదర్శనం.

★ ఇది కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయంగా చూడకుడదు కోట్లాది మంది ప్రజలు ముఖ్యంగా బహుజనుల జీవితాలను నిత్యం ప్రభావితం చేస్తున్న సాంస్కృతిక రంగం ఇది.

తరతరాలుగా అన్ని అవకాశాలను అక్రమంగా దక్కించుకుంటున్న
ఆధిపత్య కుట్ర పెట్టుబడిదార్లు, దళిత బహుజన జాతుల నుండి
ప్రకాష్ రాజ్ గారి లాంటి ప్రపంచ విజ్ఞానంతోకూడిన సామాజిక కలిగిన వారు ఎన్నో కష్ట నఫ్టాలకు ఓర్చి, ఎలాంటి గాడ్ ఫాధర్ ల సహకారం లేకుండా ఎదిగిన ప్రతిభావంతుడు ప్రకాష్ రాజ్ గారు, “మా” అద్యక్షుడైతే
ఆయన్ను స్పూర్తిగా తీసుకోని ఉత్పత్తి జాతులైన దళిత బహుజనులనుండి
మరొక్కరు ముందుకు రాకుండా ఎన్ని కుట్రలు చేయగలరో “మా” ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గారిపై చేసిన తప్పుడు ప్రచారాలే నిదర్శనం.

★ ప్రకాష్ రాజ్ స్థానికకుడు కాకపోతే, మోహన్ బాబు కొడుకు
విష్ణు కూడా స్థానికుడు కాదు. ప్రకాష్ రాజ్ గారు కర్ణాటక లో పుట్టినట్లే,
మంచు విష్ణు కూడా తమిళనాడులో పుట్టి అక్కడే చదువుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం ఒకే కులం ఆధిపత్యాన్ని చాలాయిస్తున్న విషయం తెల్సిందే. 60 పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన దొంగ ఓట్ల విషయం బయటపడినప్పుడే ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్ లు గుర్తించి నిరసన వ్యక్తం చేశారు. నటుడు శ్రీకాంత్ అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం అనవసరమన్నారు. ఒక దశలో ప్రకాష్ రాజ్ గారు కంటనీరు పెట్టుకున్నారు.

★ “మా “సభ్యత్వానికి నాగబాబుతోపాటు ప్రకాష్ రాజ్ గారు కూడా రాజీనామా చేశారు. నాగబాబు రాజీనామా చిరంజీవిపై నిరసనగా చూడాల్సిందే…!


ఇందులో రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం. ట్రెండింగ్ తెలుగున్యూస్ వాటితో ఏకీభవించాల్సిన పనిలేదు.


★ ఇంతకాలం ఆధిపత్య దోపిడి కులాల ఆధిపత్యంలో నలుగుతున్న సినిమా ఇండస్ట్రీలోకి బహుజన జాతులకు చెందిన నటి నటులు, సాంకేతిక నిపుణులు,దర్శక‌‌,నిర్మాతులు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది తత్పలితంగా,ఆధిపత్య వాదులకు,బహుజనులకు మధ్య విభజన రేఖ అనివార్యంగా ఏర్పడుతుంది. పైకి మేమంతా “మా”కుటుంబ సభ్యులమే అని చెప్పినప్పటికి అది తాత్కాలికంమాత్రమే..

★ చిరంజీవిది అటు ఇటు కాని పాత్రయే సినిమా ఇండస్ట్రీలో బాబులు,వారి బాబులదే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒకే కులం ఆధిపత్యాన్ని సవాల్ చేసి ఎదిగిన చిరంజీవి తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉపయోగపడుతున్నాడు తప్ప తనూ ఎదగడానికి ఉపయోగపడ్డ ప్రేక్షకుల్లోని దళిత బహుజన బిడ్డలు సినిమా ఇండస్ట్రీలో తనలాగే ఎదగడానికి కృషి చేయలేకపోయాడు.

★ 80 లక్షల ఓట్లు,18మంది ఎమ్మెల్యేలను కేవలం ఒక కేంద్ర మంత్రి పదవి కోసం ప్రజా రాజ్యం పార్టీ జెండా ను, కాంగ్రెస్ కాళ్ళ వద్ద వదిలేసి చెతు లెత్తేసిన చిరంజీవి చరిత్ర అక్కడే ఆగిపోయింది.

★ నాగేంద్ర బాబులా చిరంజీవి కచ్చితమైన నిర్ణయం తీసుకోని ఉంటే భవిష్యత్తులో “మా”ఎన్నికల్లో బాబుల కుల కోటగోడలను కూల్చే అవకాశం ఉండేది.

★ బాబులను భయపెట్టిన బహుజన యోధుడు ప్రకాష్ రాజ్ గారికి అభినందనలు తెలియజేద్ధాం..! నాగబాబు మాటల్లో ప్రపంచ విజ్ఞానం కల్గిన ప్రకాష్ రాజ్  “మా”అద్యక్ష పదవి లేకున్నా అణువంతయినా సేవలను  తెలుగు సినిమా ఇండస్ట్రీ వదులుకోలేదు,

కులం బలంలేని నిజమైన బహుజన భారతీయుడు ప్రకాష్ రాజ్.
దళిత బహుజన కళాకారుల సంక్షేమం కోసం మరింత కసితో కృషి చేయాలి.
తెలంగాణ నేలపై బహుజన జాతులనుండి అద్భుతమైన నటి నటులను సినిమా ఇండస్ట్రీకి అందించే కృషి చేయాలని బహుజన సమాజం కోరుతుంది.

★ కోట్లాది మంది తెలుగు ప్రజలు ప్రకాష్ రాజ్ గారి గెలుపును ఆకాంక్షించారు. నటులు శ్రీ కాంత్ తన గెలుపు ఆనందం కంటే ప్రకాష్ రాజ్ లాంటి గొప్పనటుడు మంచి మనిషి ఓడిపోయారని భాదపడ్డారు.
ఆధిపత్య దోపిడి కులాల బిడ్డలంతా అమెరికాలో స్థిరపడి అక్కడి పౌరసత్వం పొందవచ్చు, అక్కడి ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్ సభ్యులుగా గెలవచ్చు.
స్థానికత గురించి మాట్లాడుతున్న మూర్ఖులు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. ఒక తెలుగు మంగలి వాడైన కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా,ఆయన అనంతరం ఆయన కొడుకు స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు భారతదేశంలోనే ఒక గోప్ప పాలకుడిగా ప్రసంశలు అందుకుంటున్నారు.

కానీ తెలుగు భాషను దాని ఉన్నతిని అర్థం చేసుకోని ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో చైతన్యం నింపుతున్న ప్రకాష్ రాజ్ పరాయి వాడు అయ్యాడు.
తమిళనాడు పుట్టి అక్కడే చదువుకోని హైదరాబాద్ వచ్చి బట్లార్ తెలుగు నేర్చుకున్న మంచు విష్ణు తెలుగు వాడైపోయిడు. బాబులంతా ఒకటైన బహుజనుడు. ఒక్కడై ఓడి గెల్చాడు.

ఈ ఓటమిని కేవలం ప్రకాష్ రాజ్ ఓటమిగా చూడకూడదు ఇది నీతికి, అవినీతికి,కుల తత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా చూడాలి.
ఈ అనుభవం భవిష్యత్తు బహుజనుల గెలుపుకు బాటలు వేస్తుందని ఆశిస్తూ…

(దండి వెంకట్, బహుజన లెఫ్ట్ పార్టీ-BLP రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
తెలంగాణ రాష్ట్ర కమిటీ, హైదరాబాద్.)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *