నవరాత్రుల్లో దుర్గమ్మకు ప్రత్యేక నివేదనలు ఎలా ఉంటాయి?

 

  నవరాత్రుల్లో రోజుకో అలంకరణ ఉంటుంది,  
అలంకరణ బట్టి నైవేద్యం  ఉంటుంది.

దసరా మహోత్సవాలలో దుర్గమ్మ వారికి ప్రతీరోజూ ప్రత్యేక నివేదనలు ఉంటాయి.

నిత్యం లలితాసహస్త్రనామం పఠించేవారికి అమ్మవారికి ఏఏ అన్నప్రసాదాలు ఇష్టమో అవగతమవుతుంది. 99వ శ్లోకంలో పాయసాన్న ప్రియా, 103వ శ్లోకంలో గుణాన్ని ప్రీత మానసా, 105వ శ్లోకంలో దద్యన్నా శక్త హృదయా, 108వ శ్లోకంలో హరిద్రాన్నైక రసిక ప్రియా ఇలా పలురకాల అన్న పదార్థాలు అమ్మవారికి ఇష్టపన్న వర్ణనలు ఉన్నాయి.

అమ్మవారికి ప్రతినిత్యం ప్రత్యేక అలంకారం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆయా రోజూ తిథిని బట్టి అమ్మవారి అలంకారం ఉంటుంది. ఆరోజుకు అనుగుణంగా అమ్మవారికి హారాలు ధరింపచేస్తారు. వస్త్రధారణ రంగులు కూడా మారుతాయి. అమ్మవారికి నిత్యం ఒక్కో చీర పదివేలకు పైగా ఖరీదు చేసే ఐదు చీరలను కడతారు.

జలతార అంచులు గల ప్రత్యేక చీరలను ధరింపచేస్తారు. అదే సమయంలో అమ్మవారికి నివాసాలలో దసరా పది రోజులు అర్చనలు చేసేవాడు. వారి వారి అభిమతం చేరకు నైవేద్యాలు పెడుతుంటారు. దుర్గగుడిలో
ఏరోజుకారోజు ప్రత్యేక వంటకాలను చేసి అమ్మవారికి నివేదనలు పెడతారు. అప్పాలు, అరి సెలు, దధోజనం, కటుపొంగతి. తీపిపొంగలి. పాయసం. రవ్వకేసరి. పులిహోర, లడ్డు. తీపిబూంది.

ఇలా ఆయా రోజులలో వైవేద్యాలు పెడతారు. పండితులు కొందరు అమ్మవారి వైవేద్యాలను ప్రతిపాదించారు.

బాలా త్రిపుర సుందరి : పొంగలి, గాయత్రిదేవి – పులిహోర, అన్నపూర్ణాదేవి – కొబ్బరన్నం, బాలాత్రిపుర సుందరి – గారెలు,

సరస్వతి దేవి: పెరుగన్నం, మహాలక్ష్మీదేవి – దవ కేసరి, దుర్గా దేవి – కదంబం (అన్నికూరగాయులు కలిపి చేసే పులుసు
వంటి పదార్థం)

మహిషాసుర మర్ధిని : బెల్లంతో చేసిన వంటకం (బెల్లం పరమాన్నం)

రాజరాజేశ్వరి దేవి: ఆవుపాలతో చేసిన పరమాన్నం ఇలా ప్రత్యేక నైవేద్యాలు ఉన్నాయి. అమ్మవారికి పాలతో చేసే పదార్థాలన్నిటికీ
ఆవుపాలనే వినియోగించాలి. మిరియాలు, లవంగాలు, జీడిపప్పు, యాలుకలు, కిస్మిస్ పండ్లు, ధనియాలు వంటే చాటిని ఆయా పదార్థాలకు అనుగుణంగా వినియోగిస్తారు. ముఖ్యంగా దసరా మహోత్సవాల సమయంలో వాతావరణం బాగుండదు. ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తుంటాయి. ఈదశలో ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని చెబుతారు. ఇందుకు అనుగుణంగానే మిరియాలు, లవంగాలు, యేలకలు వంటి వాటిని
వినియోగించడం జరుగుతుంది. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన వాటిని స్వీకరించడం ద్వారా అటు ఆరోగ్యం.

ఇటు ఆధ్యాత్మికం తోడై ప్రసాదాలలో ప్రత్యేక శక్తి ఉంటుందని నమ్మక, వైవేద్యాలు సమర్పించేటప్పుడు అత్యంత భక్తి ఉండాలని పండితులు చెబుతారు. ఇప్పుంగా పెడితే అమ్మవారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారని సమ్మకం.

నైవేద్యాలను వండేటప్పుడు కూడా వాము పారాయణ చేయడం ద్వారా దివ్యత్వం ప్రసాదంలో చోటు చేసుకుంటుందని చెబుతారు. అమ్మవారి నైవేద్యాలు పెట్టిన తర్వాత మంత్రపుష్పం, హారతులు ఇవ్వడం, పూజ
సమర్పణ వంటివి సభక్తి పూర్వకంగా జరగాలంటారు.

నేడు గాయ‌త్రీదేవిగా దుర్గ‌మ్మ సాక్షాత్కారం…

ఇంద్ర‌కీలాద్రి : శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా మూడో రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ త‌దియ శనివారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ గాయ‌త్రీదేవిగా సాక్షాత్క‌రించింది.

వేద‌మాత‌గా ప్ర‌సిద్ధి పొందిన ఈ త‌ల్లి ముక్తా, విద్రుమ‌, హేమ‌, నీల‌, ధ‌వ‌ళ వ‌ర్ణాల‌తో ప్ర‌కాశిస్తూ భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తుంది. పంచ ముఖాల‌తో ద‌ర్శ‌న‌మిచ్చే సంధ్యావంద‌న అధిష్టాన దేవ‌త అయిన గాయ‌త్రీదేవిని పూజిస్తే స‌క‌ల ఉప‌ద్ర‌వాలూ తొల‌గుతాయ‌నీ, బుద్ధి తేజోవంతం అవుతుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.

ఈ రోజున వంగ‌, ఆకుప‌చ్చ‌, బంగారు వ‌న్నెల చీర‌ల్లో కొలువుదీరిన అమ్మ‌వారికి నైవేద్యంగా పులిహోర‌, కేస‌రి, పుల‌గాల‌ను స‌మ‌ర్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *