* కేటీయార్ ప్రారంభించాక తాళం బెట్టారు
ఈ రోజు వరంగల్ పౌర పద్మాక్షమ్మ గుడి సమీపాన ఖాళీ స్థలంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కేంద్రప్రభుత్వ నిధులతో మూడేండ్ల కింద నిర్మించిన ప్రారంభించని శౌచాలయాన్ని ప్రారంభించడమే లేదు.
ఈ రోజు వరంగల్ పౌర స్పందన వేదిక ఈ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ నిరసన తెలిపింది.
ఈ కార్యక్రమంలో బాధ్యులు నల్లెల్ల రాజయ్య,చీకటి రాజు,గోనెల దేవెందర్ ,మచ్చ రాజు,బోయిని రాజు,ఎన్ .రవిందర్ ,కొడారి రాజు,గోగుల నరేశ్ ,జోగుల విజయ్ తదితరులు పాల్గొన్నారు.
కాకతీయ పట్టణాభి వృద్ధి సంస్థ పద్మాక్షి గుడి గుండం ప్రక్కన గల ఖాళీ స్థలంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో(హృదయ్ పథకం )మూడేండ్ల కింద నిర్మించి ప్రారంభించక పోవడంలో గల ఔచిత్యమేమిటని వారు ప్రశ్నించారు.
నిర్మించిన శౌచాలయాన్ని ఎందుకు ప్రారంభించడం లేదో ఎవరికి బోధపడటంలేదు. పద్మాక్షమ్మగుడి, సిద్ధేశ్వర దేవాలయం ,సమీపంలో గల వేయి స్థంభాల గుడిని పర్యాటక స్థలాలుగా గుర్తించి ఈ దేవాలయాల పరిసరాల్లో మౌళిక సదుపాయాల రూపకల్పనకు కేంద్రం నిధులు కేటాయించింది.అందులో భాగంగానే కుడా శౌచాలయంతో పాటు వాహనాల నిలుపుదలకు పార్కింగ్ స్థలాన్ని కూడా ప్రణాళికాబద్ధంగా నిర్మించింది.
మూడేండ్లుగా ఎంతో మంది దూర ప్రాంతాలనుండి బస్సులు ,కార్ల ద్వారా ఈ దేవాలయాల సందర్శనకు వస్తున్నారు. పర్యాటకులు కాలకృత్యాలు తీర్చుకోవటానికి,స్నానపానాదులు ముగించుకోవటానికని నిర్మించిన శౌచాలయానికి వేలాడుతున్న తాళం కప్పలను చూసి నిరాశతో వెళ్ళిపోతున్నారు. ఇది ఎంత ఇబ్బందికలిగిస్తుందో వూహించవచ్చని వారు అన్నారు.
వినియోగంలో లేనందున ఈ శౌచాలయం క్రమక్రమంగా శిథిలావస్థకు చేరుతున్నదని ఇది ప్రజాధనాన్ని వృధాచేయడమే నని వారు పేర్కొన్నారు
ఓట్లకు డబ్బులు తీసుకున్న పౌర సమాజమేమో నిలదీసే స్థితిని దశాబ్ధం కిందనే కోల్పోవడం సిగ్గుచేటుగా పౌర స్పందన వేదిక భావిస్తున్నది.
ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో రాష్ట్రంలో మరెక్కడా జరుగని రీతిలో జరిగే సద్దుల బతుకమ్మ దసరా వేడుకలు జరుగుతుంటాయని, వాటికి వేలాదిగా తరలి వచ్చే మహిళలు ,పిల్లలు,పురుషులకు అనుకోకుండా అత్యవసరపడే శౌచాలయం వినియోగంలో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని వారు తెలిపారు.
ీ కర్తవ్యం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థదే నన్న సోయి తెచ్చుకొని సద్దుల బతుకమ్మ,దసరా పండుగలనాటికైనా శౌచాలయాన్ని ప్రారంభించాలని వరంగల్ పౌర స్పందన వేదిక డిమాండ్ చేస్తున్నది.
ఇదే ప్రాంతంలో శౌచాలయాన్ని ఆనుకొని గత మున్సిపల్ కమీషనర్ అతి సుందరంగా నిర్మించిన “సరిగమ పార్కును” రాష్ట్ర పురపాలక మంత్రివర్యులు కేటీయార్ ప్రారంభించి వెళ్ళి పోయిన అర్థగంటకే పార్కు గేట్లకు తాళాలు బిగించారు. ఈ రోజు వరకు సందర్శకులకు అనుమతి లేదు. ఈ పార్కు సందర్శకులకోసం కాకుండా మరెవ్వరి కోసమని వరంగల్ పౌర స్పందన వేదిక ప్రశ్నిస్తున్నది.
వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు ,జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే సందర్శకులకు అనుమతినిచ్చేందుకు ఆదేశాలు జారీ చేయాలని వేదిక డిమాండ్ చేస్తున్నది.