తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు మీద ఇపుడొస్తున్న వివాదాలనుచూస్తే, ఈస్టిండియా కంపెనీకాలంలో ఆలయం ఎలా ఉండిందనే పోలిక అవసరమవుతుంది.ఎందుకంటే, మొదటి సారి ఆలయం ప్రభుత్వం ఏలుబడిలోకి వచ్చింది అపుడే. తిరుమల తిరుపతి అలయాలు, మొదట అనేక చేతులు మారి ఆర్కాట్ నవాబుల చేతికివచ్చింది.వారినుంచి ఈస్టిండియా కంపెనీ తీసుకుంది. తర్వాత హథీరామ్జీ మహంతుల చేతిలో ఉండింది.ఆపైన ధర్మకర్తల మండలి (Board of Trusties) కి వెళ్లింది. అదే విధానమే ఇపుడూ కొనసాగుతూ ఉంది.
తిరుమల, తిరుపతి ఆలయాలను కొన్ని నియమాల ప్రకారం నడిపేందుకు ప్రయత్నించి బాగు చేయాలనుకున్నది ఈ స్టిండియా కంపెనీయే అని చరిత్ర పరిశోధకురాలు,‘ హిస్టరీ ఆఫ్ హిందూ రిలిజియస్ ఎండోమెంట్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’ పుస్తకం రచయిత్రి డాక్టర్ కౌతు నిర్మల కుమారి చెబుతున్నారు.
1801లో ఆర్కాట్ నవాబునుంచి నెల్లూరు, సౌత్ , నార్త్ ఆర్కాటు జిల్లాలు కంపెనీ పాలనకిందికి వచ్చాయి.అలా తిరుపతి కంపెనీ వశమయింది. వీళ్లు మొదటి చేసిన పని ఆలయ పాలన కోసం ఒక నియమావళి రూపొందించడం. అదే బ్రూస్ కోడ్. ఇందులో ఆలయ పాలనకు సంబంధించిన 42 నియమాలున్నాయి.
ఆలయభూముల ఎక్కడున్నాయి, ఎవరిచేతిలో ఉన్నాయి సర్వే చేయించి ఈస్టిండియా కంపెనీ వారు పునరుద్ధరించారు. ఆలయాలకు ప్రభుత్వం నుంచి కొంత వార్షిక సాయం అందిస్తూ వచ్చారు. ఆలయ సొమ్ముకాజేస్తున్నవాళ్లను ఏరిపారేశారు. తిరుమలలో మొదటి స్కాం బయటపెట్టి నేరస్తులను శిక్షించారు. ఆలయంలోపల జరిగే సంప్రదాయాలకు ఎట్టిపరిస్థితుల్లో ఆటకం కలిగించవద్దని కంపెనీ ప్రభుత్వం అప్పటి నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ జార్జ్ స్ట్రాటన్ ను ఆదేశించింది.
The Government had provided funds and made some advances to the temples for the repairs, upkeep and general maintenance, organization of festivals and feasts. Religion being so close to the heart of the natives, the British thought it prudent to be liberal and appear so to impress the local people of the advantage of their association and superintendence.
1805 జూలై 12 నుంచి 1810 ఫిబ్రవరి 28 మధ్యకాలంలో ఊగ్రాణం సోర్ట్స్ విభాగం ఇన్ చార్జ గా ఉన్నశీనప్ప, రామరావు అనే ఇద్దరు వ్యక్తులు గుడి నిధులను దుర్వినియోగపరిచినట్లు ఆరోపణలుఅందాయి. దీని మీద విచారణ జరగింది. ఈ విభాగంలో అక్రమాలు జరిగాయని తెలియగానే వారిద్దరిని కొలువు నుంచి కంపెనీ ప్రభుత్వం తప్పించిన విషయాన్న డాక్టర్ నిర్మలకుమారి ఉదహరించారు.
తిరుపతి వంటి ఆలయాలనుంచి అదనపు రాబడి రాబట్టుకున్నా, 1817లో ’రెగ్యులేషన్ 8‘ తీసుకువచ్చి దాని ప్రకారం సంప్రదాయ బద్దంగా తిరుపతి తో పాటు మద్రాస్ ప్రెసిడెన్సీ ఆలయ పానల సంయమనంతో సాగేలా కంపెనీ చర్యలు తీసుకుందని డాక్టర్ నిర్మల కుమారి ఈపుస్తకంలోరాశారు.
“Their caution to Collector George Stratton that in his enthusiasm to balance the budget or produce a surplus, he should not do away with the customary expenditure, was another instance of balanced judgment, typical of the British” డాక్టర్ నిర్మల రాశారు.
1843లో దాకా ఈ విధానం సాగింది. ఆయేడాది, తిరుపతి ఆలయ పాలనా వ్యవహారాలకు అధికారులు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో బోర్డు పరిపాలన హధీరామ్ జీ మఠానికి అప్పగించారు. ‘ఇస్టిండియా కంపెనీ కాలంలో తీసుకున్న చర్యల ఆలయంలో అక్రమాలు తగ్గాయి, ఆలయ నిధుల దుర్వినియోగం అవుతాయనే ప్రమాదం తక్కువయింది. ఆలయాల పర్యవేక్షణ వల్ల సర్వత్రా హర్షం వ్యక్త మయింది. ఈస్టిండియా కంపెనీ ప్రజల మనసుదోచుకునేందుకు తీసుకున్న మంచిచర్యల్లో ఇదొకటి,’ నిర్మలకుమారి రాశారు.
The Government had provided funds and made some advances to the temples for the repairs, upkeep and general maintenance, organization of festivals and feasts. Religion being so close to the heart of the natives, the British thought it prudent to be liberal and appear so to impress the local people of the advantage of their association and superintendence.
క్రమంగా ఆలయ పాలన మఠానికి అప్పగించినా పరిపాలన తీరు మీద ఆరోపణలు రావడంతో 1933 లో మళ్లీ ప్రభుత్వ ఆదీనంలోకి వచ్చింది. ఈ లెక్కన ఈస్టిండియా కంపెనీ రోజుల్లో ఆలయ పాలన మెరుగ్గాసాగిందేమో అనిపిస్తుంది.అప్పటి నార్త్ ఆర్కాట్ కలెక్టర్ జార్జ్ స్ట్రాటన్ పాత్ర శ్లాఘనీయమని చెబుతారు. అదీ సంగతి.
ఇటీవల టిటిడి మీద రాని ఆరోపణ లేదు. దీనికి కారణం రాజకీయ జోక్యమేనని చాలా మంది ఆరోపిస్తారు.
ఇంతకీ టిటిడి ఎపుడు రాజకీయనేతల అడ్డాగా మారింది?
రాజకీయ నేతలను టిటిడి బోర్డు చీఫ్ గానియమించడం కొత్తకాదు. 1951లో టిటిడి యాక్ట్ ప్రకారం ఏర్పాటయిన తొలిబోర్డుకు ఛెయిర్మన్ వెంకటస్వామి నాయుడు ఎమ్మెల్సీ. అయితే, అదెపుడూ వివాదాస్పదం కాలేదు. 1951-1983 మధ్య టిటిడికి దాదాపు 16 మంది చెయిర్మన్ లయితే, అందులో వల్లియప్పన్ , సి అన్నారావు, ఎన్ రమేశన్, శ్రావణ్ కుమార్, ఎల్ సుబ్బయ్య, కె మురళీ ధర్ లు ఐఎఎస్ అధికారులు. ఈ పరిస్థితి 1983 దాకా కొనసాగింది. 1983 నుంచి పరిస్థితి మారింది. ఆయేడాది ముఖ్యమంత్రి ఎన్టీరామారావు అత్తిలి ఎమ్మెల్యే వికెడివిఎస్ రాజను ఛెయిర్మన్ గా నియమించడంతో కొత్త రాజకీయ యుగం మొదలయింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి గా వచ్చేనాటికి రాష్ట్ర సాంఘికా,ఆర్థిక,రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. టిటిడిని హిందూ ధర్మ సంస్థగా కాకుండా సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా చైర్మన్,సభ్యుల నియమాకాలు జరిపి రాజకీయ సంస్థగా మార్చి అదుపులోకి తీసుకోవడం మొదలయింది.
అనుకూలమయిన రూలింగ్ పార్టీ నాయకుడినే టిటిడి చెయిర్మన్ గా నియమించడం టడిపి నేత కళా వెంకటరావును నియామకంతో మొదలయిందని చెప్పవచ్చు. దీని తారాస్థాయి 2019లో వచ్చిన వైసి సుబ్బారెడ్డి నియామకం.
1983- 2021 మధ్య 23 సార్లు ఛెయిర్మన్ లను నియమిస్తే ఇందులో ఒక ముగ్గురు ఐఎఎస్ అధికారులు, ఒక అడిటర్ మినహా అంతా అధికార పార్టీ నేతలే. కాంగ్రెస్, టిడిపి, ఇపుడు వైసిపి ప్రభుత్వాలన్ని టిటిడి మీద పట్టు కోసం పనికొచ్చే వారినే చెయిర్మన్ నియమించుకుంటువస్తున్నాయి. ఇందులో విశేషమేమిలేకపోయినా, ఈ పోస్టును ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు వాడుకున్నారు, ఎన్నికల్లో ఓడిపోయిన వారి పునరావాసానికి వాడుకున్నారు. ఆర్థికంగా పార్టీని ఆదుకున్న వారికి కానుకగా సమర్పించారు. ఇలాంటి దారుణాలు 1983కు ముందు లేవనే చెప్పాలి. ఇటీవల ముఖ్యమంత్రులు తమ రాజకీయ,వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బోర్డు చెయిర్మన్, బోర్డు సభ్యలను ఎంపిక చేస్తూవస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ నియమించిన 52 మంది ప్రత్యేకాహ్వానితులు దీనికి పరాకాష్ట.
బోర్డు పరిమాణం ఎలా పెరుగుతూ వచ్చింది?
1983 తెలుగు రాజకీయాల్లో మార్పులొచ్చాయి. తెలుగుదేశం పార్టీ రావడంతో రాజకీయ వ్యవస్థ విస్తరించింది. దానికితోడు పారిశ్రామికీకరణ మొదలయింది. దేశరాజకీయాల్లో టిడిపి కీలక పాత్ర పోషించడం మొదలయింది.పార్టీలకు ఎన్నికల ఖర్చు బాగా పెరిగింది. ఇదే కాలంలోనే టిటిడి విస్తరణ కూడా బాగా పెరిగింది. భక్తుల సంఖ్య, రాబడి బాగా పెరిగాయి. టిటిడి పదవుల మీద క్రేజ్ మొదయింది. ఇది రూలింగ్ పార్టీలకు బాగా పనికొచ్చింది. తమ ప్రయోజనాలకు పనికొచ్చేవారిని బోర్డు సభ్యులుగా చేసేందుకు బోర్డు పరిమాణం పెంచుతూపోయారు. ఇపుడు 82 మంది స్థాయికి చేరుకోవడం ఇందులో భాగమే.
1933 నాటి మద్రాసు చట్టంతో తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలన హధీరాంజీ మహంతులనుంచి ఒక కమిటీకి మారింది. అపుడు ఏడుగురుసభ్యులతో కమిటీ వేశారు. పదవీ కాలం మూడేళ్లు. ఇందులో ఒకరు అధ్యక్షుడు. ఈ వ్యవస్థ 1951 లో ‘మద్రాసు హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండో మెంట్స్ చట్టం’ వచ్చేదాకా సాగింది. ఈ కాలంలో మొత్తం ఆరుగురు అధ్యక్షులువచ్చారు. ఇందులో ఒకరు మహంత్. మిగతావారు, వెంకటరంగరాయన్, టి రామలింగమ్ చెట్టియార్, రఘునాథరెడ్డి, జి నారాయణ స్వామి చెట్టి, వెంకటస్వామినాయుడు లు పేరున్న నేతలే అయినా, వాళ్లు నియామకం ఎపుడూ వివాదం కాలేదు. 1951 చట్టం తో కమిటీ స్థానంలో ధర్మకర్తల మండలి వచ్చింది. ఇందులో కేవలం అయిదుగురే సభ్యులు. తర్వాత ఆంధప్రదేశ్ ఏర్పడటం,కొత్త చట్టం అవసరం వచ్చింది. 1966లో కొత్త టిటిడి చట్టం వచ్చింది. బోర్డు11 మంది సభ్యులకు పెరిగింది. అయితే, ఇందులో శాసన సభ్యులు ముగ్గురు మాత్రమే ఉండాలని, ఒక ఎస్ సి ,మరొకరు మహిళఉండాలనే నియమం అమలులోకి వచ్చింది. 1979 లో వచ్చిన టిటిడి చట్టం బోర్డును ఒక ఛెయిర్మన్, ఇద్దరు సభ్యులకు కుదించింది. ఈ చిన్న కమిటీ 1983 తర్వాత పెరిగి పెరిగి పెద్దవుతూ 2015 నాటికి 19 మందికి, 2021 నాటికి 82 కు చేరింది. ఇదెంత ఎంతవివాదం సృష్టించిందో చూశాం.