ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గణంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు అమ్మవారుశ్రీ శైలపుత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి ఒడి బియ్యం పోసి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు.
అనంతరం రాజ గోపురం నుండి గోకుల్ షెడ్ వరకు పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం వ్యాపార దుకాణ సముదాయానికి శంకుస్థాపన చేశారు.
ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ నామస్మరణతో ఏడుపాయల మారుమ్రోగింది. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ సింగూర్ నుండి పెద్ద ఎత్తున వరద వచ్చినప్పటికీ ఆలయానికి ఎలాంటి నష్టం జరగలేదని అమ్మ వారి ఆశీస్సులు పాడి పశువులు, జిల్లా ప్రజల పైన ఉండాలని అన్నారు.
రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే శరన్నవ్రత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇవొ సార శ్రీనివాస్ తెలిపారు.