1857 జనవరి నాటి మాట. కలకత్తా డమ్ డమ్ కంటోన్మెంట్ లో ఒక బ్రాహ్మిణ్ సిపాయి డ్యూటీ దిగి తన నివాసానికి వెళ్తున్నాడు. ఆయన చెతిలో ఒక చెంబుఉంది.అందులో నీళ్లున్నాయి. ఈ లోపు అటుగా వెళ్తున్న తక్కువ కులానికి చెందిన కళాసీ ఎదురుయ్యాడు. దాహమవుతా ఉంది, కొన్ని నీళ్లిస్తావా అని సిపాయిని అడిగాడు. కుదరుదు,నీకు నీకీ చెంబుతో నీళ్లిస్తే మైలపడుతుంది అని చెప్పాడు. వెంటనే కలాసీ చురక అంటిస్తూ, ‘నువ్వేమో గొప్పకులమని చెప్పుకుంటావు. సైన్యంలో కూర్చుని ఆవు, పంది కొవ్వుతోపూసిన కాట్రిడ్జిలను మాత్తం నోట కొరికేందుకు జంకవు,నాకు నీళ్లిస్తే మైల అంటుతుందంటావు,” అని తనదారిన తాను వెళ్లిపోయాడు.
అయితే, ఎన్ ఫీల్డ్ కాట్రిడ్జిలకు ఆవు,పంది కొవ్వు పూస్తున్నారన్న విషయం బ్రాహ్మణ సిపాయి మెదడులో నాటుకుపోయింది. క్షణాల్లో దావాణలంలాగా వ్యాపించింది. తెలిసిన వారందిరితో ఈ కొవ్వు వ్యవహారం విచారించడం మొదలుపెట్టారు. ఇది కలకత్తా నుంచి ఇతర పట్టణాలకు కూడా వ్యాపించింది. సిసాయిలంతా అగ్రహోదగ్రులయ్యారు.
మార్చినాటికి బెంగాల్ బ్యారక్ పూర్ తిరుగుబాటు దోరణి మొదలయింది. ఇది మీరట్ కు పాకింది.అక్కడే తిరుగుబాటు తొలిసారి కార్యరూపం దాల్చింది. చాలా చిన్న స్థాయిలో వెల్లడయిన నిరసన. అయితే, కంపెనీసైనికు రాద్ధాంతం చేశారు. ఈ సంఘటన ఏమిటంటే…
1857 ఏప్రిల్ 24న మీరట్ లోని ధర్డ్ బెంగాల్ లైట్ క్యావల్రీకి చెందిన 90 మంది సిపాయిల్లో 85 మంది ఈ కొత్త క్యాట్రిడ్జిలను వాడేందుకు తిరస్కరించారు. కంపెనీ ప్రభుత్వం దీనిని చాలా సీరియస్ తీసుకుంది.
ఈ ధిక్కార ధోరణిని మొగ్గలోనే తుంచేయాలని భావించింది. వీళ్లందరిని కోర్ట్ మార్షల్ చేసింది. తిరుగుబాటు దారులందరికి శిక్ష విధించారు. దీనిని ఇది చాలా అవమానకరంగా ప్రకటించారు.
మే 9 వతేదీన భారతీయ, యూరోపియన్ సిపాయిలు చూస్తుండగా వీరందరిని వూరేగింపుగా సాయుధ సైనికులు వెంటరాగా ఒక బయలు ప్రదేశానికి తీసుకువచ్చారు. అప్పటికి వారంతా రెజిమెంటల్ యూనిఫాంలోనే ఉన్నారు. అంటేఇంకా సైనికులే అన్నమాట. తర్వాత వాళ్లకు విధించిన పదేళ్ల శిక్ష, సర్వీస్ నుంచి బర్త్ రఫ్ ను చదివి వినిపించారు. తర్వాత కొంత మంది సైనికులు వచ్చి వెనక వైపు నుంచి వారి యూనిఫామ్ ని చించేశారు. కాళ్లకు సంకెళ్లు వేశారు.
ఈ విషయాన్ని ఈ టెలిగ్రామ్ ద్వారా ఇతర అధికారులకు తెలియ చేశారు. అందమయిన దస్తూరితో రాసిన ఆ టెలిగ్రామే ఈపోటో.
Received the 85 prisoners this morning.All is quiet, asked for assistance of military guard, is to be at jail by sunset. Sentence of Eleven of the prisoners reduced by Genl. Hewitt to five years. The remainder to be imprisoned for ten.”
ఈ టెలిగ్రాం భారతీయ సైనికుల్లో నిప్పురవ్వ వెలిగించింది.
1857,మే 10 ఆదివారం. 85 మందిని జైలుకు పంపడంతో ఇక సద్దుమణగిందని అనుకుని యూరోపియన్లంతా చర్చిలకు వెళ్లారు.మీరట్ లో ని మూడు ఇండియన్ నేటివ్ రెజింమెంట్ల సిపాయిలు తిరగబడ్డారు. బెంగాల్ నేటివ్ ఇన్ ఫాంట్రికి చెందిన లెఫ్టినెంట్ జాన్ ఫినిస్ (John Finnis) కాల్చిచంపారు. ఆయన లండన్ మేయర్ సోదరుడుకూడా. తర్వాత కనిపించిన యూరోపియన్ల నంతా కాల్చిపడేశారు. వాళ్ల బంగళాలను తగులబెట్టారు. రెసిడెన్సియల్ క్వార్టర్లను ధ్వంసం చేశారు. తాళాలను పగులగొట్టి జైళ్లను బార్లా తెరిచారు. తిరుగుబాటు అనుమానంతో అరెస్టయిన సిపాయిలందరిని విడుదల చేశారు.
మీరట్ ఊచకోత గురించి ఇంగ్లీష్ మన్ (Englishman ) అనే పత్రిక చక్కగా వివరించింది.
“On all sides shot up into the heavens great pinnacles of waving fire, of all hues and colors, according to the nature of the fuel that fed them, huge volumes of smoke rolling sullenly off in the sultry night air, and the crackling and roar of the conflagration mingling with the shouts and riot of the mutineers.”
ఈ టెలిగ్రామ్ ని జాగ్రత్తగా గమనించండి. చాలా ఆసక్తికరమయిన వివరాలున్నాయి. ఆరోజులలో టెలిగ్రామ్ రుసుము దూరాన్ని బట్టి వసూలు చేసేవారు. 400 మైళ్లకి ఒక రుపాయి, 800 మైళ్లకి రు. 2 లు, 1200 మేళ్లకి రు. 3 1600 మైళ్లకి రు.4 వసూలు చేసేవారు.
ఈ టెలిగ్రామ్ ని ఆగ్రా ఎలెక్ట్రిక్ టెలిగ్రాఫ్ ఆఫీసు నుంచి పంపించారు. ఎలెక్ట్రిక్ టెలిగ్రాఫ్ హెడ్ లైన్ కింద చిన్ అక్షరాలలో టెలిగ్రాఫ్ సర్వీసులను 1855 ఫిబ్రవరి 1న ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు (Offered to the public on 1st February 1855) కూడా రాశారు. మీరట్ మేజిస్ట్రేట్ ఆఫీస్ తరఫున టెలిగ్రాం పంపించారు.
టెలిగ్రాఫ్ కార్యాలయానికి అరమైలు దూరంలో ఉంటే ఎలాంటి చార్జ్ వసూలు చేయకుండా టెలిగ్రాం తీసుకు వచ్చి ఇస్తారు.. ఆపైన ప్రతిమైలుకి నాలుగణాలు వసూలు చేస్తారని కూడా రాశారు.