అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు మాట్లాడడం శాసన వ్యవస్థకే మచ్చ అని టిపిసిసి కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. దళితలకు కుటుంబానికి మూడెకరాలు ఇస్తానని తానెపుడూ ప్రకటించలేదని నిన్న అసెంబ్లీ లో కెసిఆర్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ, ఇంత బాహాటంగా అబద్దాలు చెప్పడం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో నే కాదు, 2014,2018 ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని శుష్క వాగ్దానాలు ఇచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకొని వాటిని మార్చిపోవడం కెసిఆర్ బాగా అలవాటుచేసుకున్నారని సుధాకర్ గౌడ్ వ్యాఖ్యానించారు.
సుధాకర్ గౌడ్ ఇంకా ఏమన్నారంటే...
దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని కెసిఆర్ చేసిన ప్రకటనను రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు. చెబుతూ ప్రజాస్వామ్య విలువలను పాతర పెట్టి పామ్ హౌస్ పాలన సాగిస్తూన్నందున ఆయన మర్చిపోయారేమో.ఈ విషయానమని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష లు నెరవేరక పోగా కల్వకుంట్ల కుటుంబం అక్రమ సంపాదనలో వృధా వాగ్దానాలతో దినదినాభివృద్ది చెందుతుంది.
హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టి ఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ లను, ఎంపిటిసిలను,స్థానిక నాయకులు ను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూన్నారు. తెలంగాణా లో రాజకీయల్ని భ్రష్టు పట్టించిన ఘనత కె సి ఆర్ కె దక్కుతుంది.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే, హుజూరాబాద్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
టిఆర్ ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి చిత్తశుద్ధి తో తెలంగాణ అభివృద్ధి కి పాటుపడాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రజా సేవే పరమావధిగా తెలంగాణా లో అన్ని రాజకీయ పార్టీలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ కు నాంది పలకాలని కోరుతున్నాను.