సాయి తేజ్ ఆరోగ్యం ఎలా ఉంది? 

సెప్టెంబర్ నెల 10వ తేదీన హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో హీరో సాయిధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్‌ బైక్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

హై స్పీడ్‌లో వెళ్తుండగా.. రోడ్డుపై ఉన్న ఇసుక మట్టి కారణంగా బైక్ స్కిడ్ అవడంతో సాయిధరమ్ తేజ్ కిందపడిపోయాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తేజ్.. ఘటనా స్థలంలోనే అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే.. అతన్ని మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.

అనంతరం అక్కడి నుంచి అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజ్.. ఆరోగ్య పరిస్థితి గురించి ఆ తర్వాత అప్డేట్స్ ఏమీ లేవు.

అయితే మొన్న పవన్ కళ్యాణ్ మాత్రం రిపబ్లిక్ సినిమా రిలీజ్ పంక్షన్ లో మాత్రం కోమాలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. దాంతో అందరికీ కంగారు పుట్టింది.

అయితే రిపబ్లిక్ చిత్రం దర్శకుడు దేవకట్టా మాత్రం సాయి తేజ ..ఆ ఈవెంట్ ని చూసారని అన్నారు.  అసలు సాయి తేజ్ పరిస్దితి ఎలా ఉందనేది తేజ్ తోనే  ఓ వీడియో చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో  సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తాజాగా జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్ లో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైష్ణవ్ తేజ్‌ అప్డేట్ ఇచ్చారు. తన సోదరుడు సాయి ధరమ్ తేజ్ బాగానే ఉన్నాడని, తేజ్ బాగా కోలుకుంటున్నారని సమాధానమిచ్చాడు.

వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ “సాయి ధరమ్ తేజ్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆయన ఫిజికల్ థెరపీలో ఉన్నాడు. వారం రోజుల్లో సాయి ఇంటికి తిరిగి రావచ్చు” అని అన్నారు. అంటే వైష్ణవ్ తేజ్ చెప్పిన దాని ప్రకారం సాయి ధరమ్ తేజ్ 7-10 రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

ఇక మెగా ఫ్యామిలీకి చెందిన హీరోకి ప్రమాదం అవ్వడంతో ఈ విమర్శలు రెట్టిపయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ కళ్లు తెరిచింది. ప్రత్యేక చర్యలు చేపడుతూ రోడ్లన్నింటినీ శుభ్రం చేయిస్తోంది. ముఖ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది.

మాదాపూర్ ఖానామెట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్‌స్ట్రక్షన్‌కు జీహెచ్‌ఎంసీ లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆ సంస్థ చేస్తున్న నిర్మాణ పనుల వల్ల మట్టి, ఇసుక రోడ్లపై పడుతుండడంతో జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు సత్వర చర్యలు తీసుకున్నారు.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా రోడ్లన్నింటీని ప్రస్తుతం క్లీన్ చేస్తున్నారు. ఇకపై ఎవరైనా నిర్మాణాల పేరుతో రోడ్లపై చెత్త వేసి వదిలిస్తే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *