భారత దేశపు రూపాయల నోట్ల మీద మహాత్మ గాంధీ బొమ్మ 1987లో వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది 1947లోనే నయినా, భారత జాతీయోద్యమానికి సారధ్యం వహించి, జాతిపితగా గుర్తింపు వచ్చినా, రుపాయ నోట్ల మీద ఆయన బొమ్మ రావడానికి దేశం 40 సంవత్సాలు ఆగాల్సి వచ్చింది.
స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం కొత్త నోట్లు తీసుకురావలసివచ్చింది. ఆగస్టు 15,1947న స్వాంతత్య్రం వచ్చినా భారత్ సర్వసత్తాక దేశం (రిపబ్లిక్) అయింది జనవరి 26,1950 లో మాత్రమే. ఈ మధ్య కాలంలో రిజర్వు బ్యాంక్ బ్రిటిష్ కాలం నాటి నోట్లనే ముద్రిస్తూ వచ్చింది. 1949లో మొదటి సారిగా ఒక రుపాయ నోటుని భారత ప్రభుత్వం తీసుకువచ్చింది. అపుడు డిజైన్ మీద పెద్ద చర్చ సాగింది. బ్రిటిష్ రాజు బొమ్మనే కొనసాగించ కూడదు. మరెవరరి బొమ్మ ఉండాలి. మహాత్మా గాంధీ బొమ్మ వేయాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈమేరకు డిజైన్లు కూడా సిద్దమయ్యాయి. అయితే, దాని మీద తర్జనభర్జనలు జరిగాయి.చివరకు గాంధీ బొమ్మ కాకుండా సారనాథ్ అశోక్ స్తూపం మీద సింహం చిత్రం (Lion Capital) వేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అలా భారత కరెన్సీ మీద గాంధీ బొమ్మ ముద్రించడం వాయిదా పడింది.
1950 స్వతంత్ర భారతదేశ కరెన్సీ నోట్లను 2, 5, 10, 100 రుపాయల విలువతో విడుదల చేశారు. రంగు, డిజైన్, లో తేడాలతో ఈనోట్లను ముద్రించారు. పది రుపాయల నోటు మీద వెనకవైపు నౌక బొమ్మను కొనసాగించారు.1953లో రుపాయల నోట్లమీద హిందీ భాష ప్రముఖంగా కనిపించేలా ముద్రించారు. హిందీ రుపియే (Rupiye)కు బదులుగా హిందీ బహువచనాన్ని రుపయా (Rupaya)గా నిర్ణయించారు. 1954లో 1000, 5000.10,000 విలువ గల నోట్ల ను ముద్రించారు. 1978 వీటిలో డిమానెటైజ్ చేశారు. ఇది రెండో డిమానెటైజేషన్. మొదటిది 1946లో జరిగింది. రెండు, అయిదు రుపాయల నోట్ల మీద పులి జింక, పావురాలను బొమ్మలుండేవి. అందుకే ఆరోజు ఒక పడవ అప్పు ఇస్తావా (10), జింక అప్పిస్తారా (5), ఒక ఏనుగు కావాలయ్, ఉందా (100) అని సరదాగా అడిగేవాళ్లు. భారతదేశంలో వ్యవసాయాభివృద్ధి నిసూచించే బొమ్మలు నోట్ల మీద ఉండాలని 1975లో భావించారు. దీనికోసం నూరూపాయల నోటు మీద తేయాకు తెంపుతున్నమహిళ బొమ్మ ప్రత్యక్షమయింది. 1967 లో ఆర్థిక పరిస్థితి ఇక్కట్లలో పడింది. అపుడు రుపాయనోట్ల సైజు తగ్గించారు.
అప్పటిదాకా కూడా గాంధీ బొమ్మ ముద్రించే ఆలోచన రాలేదు. 1969లో మహాత్మాగాంధీ శతజయంతి స్మారక నోట్ల సీరీస్ ను విడుదల చేశారు. తొలిసారి అపుడే నోట్ల మీద గాంధీ బొమ్మ కనిపించింది. ఇందులో సేవాగ్రామ్ ఆశ్రమం బ్యాక్ డ్రాప్ లో కూర్చుని ఉన్న గాంధీ బొమ్మ ముద్రించారు(కింది నోటో). 1972లో 20 రుపాయల నోటు, 1975లో రు. 50 నోటును విడుదల చేశారు. ఇందులో కూడా గాంధీ బొమ్మ లేదు.
1980 దశకంలో పూర్తిగా కొత్త సీరీస్ నోట్ల విడుదలయ్యాయి. నోట్ల మీద బొమ్మలన్నీ మారిపోయాయి. భారత సాంకేతికాభివృద్ధికి చిహ్నంగా అర్యభట్ట బొమ్మ రు. 2 నోటు మీద ముద్రించారు.ఒక రుపాయనోటు మీద అయిల్ రిగ్, వ్యవసాయ యాంత్రికీకరణ 5 రుపాయల మీద, హీరాకుడ్ డ్యామ్ 100 రుపాయల నోటు మీద ప్రత్యక్ష మయ్యాయి. వీటికితోడు కోణార్క ఆలయ చక్రం,నెమలి,, షాలిమార్ ఉద్యానవనం రు. 20, రు.50 నోట్ల మీదకు వచ్చాయి.
1987 నుంచి గాంధీయుగం మొదలయింది. ఇంతకాలముంటుందో తెలియదు.ఇపుడు గాంధీ నోట్ల యుగం నడుస్తూ ఉంది. గాంధీబొమ్మతో రు. 500 నోటు తొలిసారి 1987 అక్టోబర్ విడుదలయింది. వాటర్ మార్క్ మాత్రం ఆశోక స్తూపం సింహం బొమ్మ కొనసాగించారు. 1996లో మహాత్మాగాంధీ బొమ్మతో కొత్త సీరీస్ విడుదలయింది ఇందులో భాగంగా 2000లో అక్టోబర్ 9న రు.1000 నోటు విడదల చేశారు. నవంబర్ 18న రు. 500 నోటు విడుదలయింది. 2015లో రుపాయనోట్ మళ్లీ విడుదలయింది.2016లో మహాత్మాగాంధీ సీరీస్ విడదుల చేశారు.