మంత్రి గంగుల పొగుడ్తున్నారా, తెగుడుతున్నారా?

నమ్మండి నమ్మక పోండి.  హుజూరాబాద్ టిఆర్ ఎస్ అభ్యర్థి నామినేషన్ ఫీజు ఎవరు కట్టారో ఈరోజు మంత్రి గంగల ప్రభాకర్ చెప్పారు. ఆయన ఈ రోజు హుజురాబాద్ లో మార్నింగ్ వాకర్స్ తో కలసి క్యాాంపెయిన్ చేశారు. అక్కడ  మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

’ప్రజలు, కులసంఘాల నేతలు, ఆటో యూనియన్ లు స్వచ్చందంగా ముందుకు వచ్చి డబ్బులు జమ చేసి  టిఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ ఫీజు కడుతామన్నారు.  దీంతోనే గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ విజయం ఖాయమైంది,‘ అని అన్నారు.

హుజురాబాద్ నామినేషన్లు ఈ రోజుతో ప్రారంభమవుతున్నాయి.  ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ కు పార్టీ  భీపామ్ ని, క్యాంపెయిన్ కోసం రు. 28వేల చెక్కుని  ముఖ్యమంత్రి అందించారు.  ఇక మంచిరోజు చూసుకొని గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేస్తారు అని గంగుల  ఆన్నారు.

ఆర్థిక మంత్రి హారీష్ రావు తోపాటు  గంగుల కూడా చాలా రోజులుగా హుజూరాబాద్  టౌన్ వీదుల్లో తిరుగుతూ ప్రజల్లో కలుస్తూ , దుకాణాలు, సెలూన్లు, చిరువ్యాపారులు, గ్రౌండ్ల మార్నింగ్ వాకర్లతో  ముచ్చటిస్తూప్రచారం చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఆయన ఈ రోజు మార్నింగ్ వాకర్స్ ను కలుసుకుని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు మద్దతివ్వాలో వివరించారు. ఉప ఎన్నికల అవసరం వచ్చినప్పటినుంచి హుజూరాబాద్ లో ఎంత అభివృద్ధి జరిగిందో కూడా ఆయన చెప్పారు. అంటే హుజూరాబాద్ కు  ఉప ఎన్నికల్ల వల్ల చాలా మేలు జరిగిందని ఆయన చెప్పారు.

గతంలో తాను ఇక్కడికి వచ్చే సమయానికి హుజారాబాద్ అస్థవ్యస్తంగా ఉంది. సరైన రోడ్లు, తాగునీరు, పారిశుద్యం, ఆరోగ్య వసతులు, కుల సంఘాల కమ్యూనిటీ హాళ్లు లేక ప్రజలు పడుతున్నరు. ఆ ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లాను. వెంటనే నిధుల్ని మంజూరు చేశారు, అని మంత్రి గంగుల అన్నారు.

మిగతా తెలంగాణకు దీటుగా హుజురాబాద్ ని అభివృద్ధి చేయాలని ఆదేశించారని చెప్పారు.

“ఆ ప్రకారం 50కోట్ల నిధులతో సీసీరోడ్లు, డ్రైనేజీ, తాగునీరు అందించేందుకు చర్యలు మొదలయ్యాయి.  అన్ని కులసంఘాల ఆత్మగౌరవం పెంచేలా కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నాము.  ఈ అభివ్రుద్ది మరింత కొనసాగించేలా మరింత ఉత్సాహం ఇచ్చేలా ప్రజలు కారుగుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ని గెలిపించాలి.  ఈ సారి కారుగుర్తుపై పోటీచేస్తున్న వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గతంలో పార్టకి వచ్చిన మెజార్టీకన్నా పది ఓట్ల అత్యధికంగా వస్తాయి.  రాబోయే రోజుల్లో హుజురాబాద్ అభివృద్ధి భాద్యత నాదే,’ అన్నారు.

కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చావునోట్లో తలపెట్టి తెచ్చిన తెలంగాణను అదే రీతిలో  ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ది చేస్తున్నారు.  గత 20 సంవత్సరాలుగా ఈటెల రాజెందర్ నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డ హుజురాబాద్ పట్టణాన్ని 50కోట్ల నిధులతో అన్నిరకాలుగా అభివ్రుద్ది చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నేతలతో పాటు, స్థానికులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *