‘రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 నే జరపండి’

 

ఆంధ్రప్రదేశ్  రారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1 జరుతున్న దాన్ని మార్చి అక్టోబర్ 1 నే జరపాలని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి , కాంగ్రెస్ నేత రాంభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని రుయా హాస్పిటల్ దగ్గర ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.

అవతరణ దినోత్సవం , స్వాతంత్ర్య దినోత్సవాన్ని రెండు కారణాలతో నిర్వహిస్తారు:

1. నాడు త్యాగాలు చేసిన గొప్ప వారి కృషిని భావితరాలకు గుర్తు చేసి సమాజం కోసం ప్రజలు త్యాగాలు చేయాలని పురికొల్పే ప్రయత్నాలు చేస్తారు.

2. నాడు వారు ఎందుకు త్యాగాలు చేశారు అనాటి ఆశయాలు ఎంతవరకు నెరవేరింది , మిగిలి పోయిన వాటి గురించి నేటి తరం ప్రయత్నం చేయడం కోసం సందేశం ఇవ్వడం.

1953 అక్టోబర్ 1 మద్రాసు నుండి శ్రీభాగ్ అవగాహన మరియు పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తో తొలి భాషా ప్రయోక్త రాష్ట్రం ఏర్పాటు జరిగింది. నేడు తెలంగాణతో విడిపోయిన తర్వాత 1953 నాటి రాష్ట్రం ఏర్పడిన కారణంగా అక్టోబర్ 1 నే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం సముచితం.

శ్రీభాగ్ అవగాహన లో రాజధాని ఏర్పాటు రాయలసీమలో జరగాలి. అదే విధంగా కృష్ణా , తుంగభద్ర నదుల మీద రాయలసీమ నీటి అవసరాలు తీరే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి. మిగులు జలాల మీద ఆధారపడి నిర్మిస్తున్న గాలేరు నగరి , హంద్రీనీవా ప్రాజెక్టులను పూర్తి చేసి , నికరాజలాలను కేటాయించాలి.

తెలంగాణ – ఆంధ్ర రాష్ట్రం కలిపి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు చిహ్నంగా ఉన్న నవంబర్ 1 న విడిపోయినతర్వాత కూడా జరుపుకోవడం చారిత్రక తప్పిదం అవుతుంది. ముఖ్యమంత్రి జరిగిన తప్పిదాన్ని సరిదిద్దాలి. అక్టోబర్ 1 నే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి. శ్రీభాగ్ ఒప్పందంలోని అంశాలను అమలు చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *