సొంత ప్రాంత వేరుశనగ రైతులను ఆదుకోలేని ముఖ్యమంత్రి!

 

కాలవ శ్రీనివాసులు (టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి)

గతేడాది ఆశాజన కంగా వర్షాలుకురవడంతో రైతులు వేరుశనగ సాగుచేశారు. పైరుబాగా పెరిగి, కాయలు వచ్చేసమయంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల ఏర్ప డ్డాయి. కాయలు సరిగా రాక, పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఏడాది కూడా రైతులు సంశయంతోనే వేరేగత్యంతరంలేక తిరిగి వేరుశనగనే సాగు చేశారు.

మరీముఖ్యంగా అనంతపురంజిల్లాలో దేశంలోనే ఎక్కువగా వేరు శనగను సాగుచేస్తారు. ఒకజిల్లాలో 13 లక్షలఎకరాల్లోవేరుశనగ సాగు చేయడమనేది అనంతపురం జిల్లాకే సాధ్యమైంది. గతేడాది 12లక్షల 20వేలఎకరాల్లో వేరుశనగ సాగుచేసిన రైతులు దాదాపు రూ.3వేలకోట్ల విలువైనపంటను నష్టపోయారు.

అంతతీవ్రంగా నష్టంజరిగితే జగన్ ప్రభుత్వం రైతులకు కనీసం రూ.300కోట్లు కూడా పరిహారం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో కూడా తెలియడంలేదు. దాంతో దిక్కుతోచని రైతాంగం ఈ ఏడాది వేరుశనగ సాగువిస్తీర్ణాన్ని తగ్గించింది.

కేవలం 11లక్ష లఎకరాలకే పరిమితంచేసింది. రాయలసీమవ్యాప్తంగా ప్రస్తుతం అతిత క్కువగా 6లక్షల15వేలహెక్టార్లలో మాత్రమే వేరుశనగను సాగుచేశారు. గత సంవత్సరంతో పోలిస్తే,2.50లక్షల ఎకరాల విస్తీర్ణం తగ్గింది. ప్రభుత్వం సహకరించకపోవడం, గతంలోసాగుకోసం తీసుకున్న అప్పులు చెల్లించక పోవడంతో విస్తీర్ణం బాగాతగ్గింది.

ఈ సంవత్సరం కూడా వేరుశనగ పైరు పరిస్థితి ఆశాజనకంగా లేదు. సాగుచేసినదానిలో దాదాపు 15లక్షలఎక రాల్లోని వేరుశనగ పైరు ఎండిపోతోంది. ఇంతనష్టం జరుగుతున్నా ప్రభుత్వంనుంచి స్పందన లేదు.

వ్యవసాయశాఖ మంత్రి ఏంచేస్తున్నారో కూడా తెలియదు. ఆయనకు తన శాఖకు సంబంధించిన సమస్యలు, విషయాలు తప్ప, అన్నీ అవసరమే. రైతులను ఆదుకునేప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏనాడూచేసిందిలేదు. జగన్మోహన్ రెడ్డికూడా రాయలసీమవాసే. అనంతపురం వేరుశనగ రైతు కళ్లల్లోనీళ్లు వస్తుంటే, ఈప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లయినా లేదు.

ఈ ముఖ్యమంత్రి ఎందుకింత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరి స్తున్నారు? గతంలో ప్రకృతి సహకరించకపోయినా, చంద్రబాబునాయుడు గారుముఖ్యమంత్రిగా వారంరోజలు అనంతపురంలోనే ఉండి, వేరుశనగ పైరును కాపాడటానికి శాస్త్రవేత్తలను పిలిపించి మాట్లాడారు. ఉన్నంతో నీటివనరులనుఉపయోగించి, వేరుశనగపైరుకు రక్షకతడులు అందించా రు. అయినాకూడా కాస్తోకూస్తో పంటనష్టంజరిగింది. అలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచిన టీడీపీప్రభుత్వం, అనంతపురం జిల్లా వేరుశన గ రైతులకు రూ.1126కోట్ల సహాయం అందించింది.

ఆ విధంగా తరువాతి సంవత్సరం (2017)లో రైతులుతిరిగి పైరుసాగుచేసేలా వారికి మనోధైర్యం కల్పించిన ఘనత చంద్రబాబునాయుడిది. రాయలసీమలోనే ఐదేళ్లలో రూ.3,759కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ పరికరాలను చంద్రబాబునాయుడి ప్రభుత్వం రైతులకు అందించడం జరిగింది. అవికాకుండా పంటలబీమా పథకం కింద రైతులకు రూ.4,700కోట్లు అందించాము. ఆ విధంగా సీమ రైతులకు టీడీపీప్రభుత్వం దాదాపు రూ.8వేలకోట్లవరకు సాయం అందిం చింది.

ఇదంతా జరిగాక 2018లో మరలా సీమప్రాంతంలో కరువువచ్చిం ది. 2018లోవచ్చిన కరువు కారణంగా పంటలునష్టపోయిన రైతులకు 2019 జూన్ లో ప్రభుత్వం సాయమందించాలి. ఆ విధంగా సాయంచేస్తే ఒక్క అనంతపురం జిల్లాకే రూ.926కోట్లవరక సాయం అందాల్సి ఉంది. 2019 మేలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి,అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. రూ.1800కోట్లవరకు రాయలసీమరైతులకే పరిహారం ఇస్తున్నా మనిచెప్పాడు. అసెంబ్లీలో ఆయన చెప్పినమాట మాటగానే మిగిలింది తప్ప, రెండున్నరఏళ్లు పూర్తయినా సీమరైతులకు పరిహారం అందలేదు.

ముఖ్యమంత్రి మాట చెల్లుబాటుకాలేదని చెప్పడానికి తమకే సిగ్గుగా ఉంది. ముఖ్యమంత్రిస్థానంలోఉన్న వ్యక్తి అసెంబ్లీసాక్షిగా చెప్పిందే అమలు కాకపోతే, ఇక పాలకులమాటలను ప్రజలుఎలా విశ్వసిస్తారు?

కనీసం పంటనష్టం అంచనా వివరాలను కూడా ఈప్రభుత్వం సేకరించలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే, రాయలసీమవ్యాప్తంగా 2.50లక్షల ఎకరాల్లో సాగువిస్తీర్ణం తగ్గింది. రెండ్రోజుల క్రితం నేనేస్వయంగా వేరుశనగ పంటలు పరిశీలించి, రైతులతో మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెబుతున్న రైతుభరోసా కేంద్రాలవారుగానీ, వాలంటీర్లు గానీ రైతులవద్ద కు వెళ్లి , వారిసమస్యలు విన్నదిలేదు. ప్రభుత్వం ఉండికూడా రైతులకు భరోసా ఇవ్వలేనప్పుడు, అలాంటిప్రభుత్వం ఉంటేఎంత…లేకపోతేఎంత? నామ్ కేవాస్తేగా పదవుల్లో ఉండి, రైతులకు ఏమీచేయలేని నాయకులు ఏం ఊడబెరుకుతారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. తన ప్రాంతం రైతుల నుఆదుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి ఎందుకుఆస్థానంలోఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలోఉండటానికి అనర్హుడని ఈ సందర్భంగా తేల్చిచెబుతున్నాం.

వేరుశనగసాగుచేసి, తీవ్రంగానష్టపోయి అనంతపురం జిల్లాలోనే 17మంది రైతులు మరణించారు. రాయలసీమ రైతులను ఆదుకోవాలని కోరుతూ, వారికిజరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తూ, ముఖ్యమంత్రికి టీడీపీతరుపున లేఖరాశాం.

ఆయన ఇప్పటికైనా కళ్లుతెరిచి, సీమప్రాంత మరీముఖ్యంగా అనంతపురం వేరుశనగరైతులను ఆదుకోవాలని పత్రికాముఖంగా కోరుతున్నాం. గతంలో వారికి అందాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం వెంటనే అందించాలని, వేరుశనగరైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ యంత్రాలు సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేస్తున్నాం.

స్వయంగా ముఖ్యమంత్రి, వ్యవసాయమంత్రి రాయలసీమప్రాంతంలో పర్యటించి రైతుల సమస్యలను పరిష్కరించాలనికూడా డిమాండ్ చేస్తున్నాం. వారు స్పందించని పక్షంలో ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి వైఖరినినిరసిస్తూ, పెద్దఎత్తున రైతులను సమీకరించిప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమిస్తుందని, రాజీలేని పోరాటంచేస్తుందని ప్రభుత్వాన్నిహెచ్చరిస్తున్నాం.

(మంగళవార మంగళగిరి పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించిన విశేషాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *