ఆంధ్ర విపత్తుల శాఖ హెచ్చరి
తూర్పు మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుపాన్ కొనసాగుతున్నది. గోపాలపూర్ కు 310కిమీ, కళింగపట్నానికి 380 కిమీ దూరంలో కేంద్రీకృతం అయివుంది. సాయంత్రానికి కళింగపట్నం – గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీనివల్ల ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 – 95 కీమీ వేగంతో బలమైన ఈదురగాలులు వీస్తాయి.
సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు రేపటి వరకు వేటకు వెళ్ళరాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కె.కన్నబాబు. కమిషనర్ విపత్తుల శాఖ ఒక ప్రకటన విడుదల చేశారు.