మరో 12 గంటల్లో తుఫాన్….హెచ్చరిక

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తుఫాన్ హెచ్చరిక

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం రాగల 12 గంటల్లో బలపడి తుఫానుగా మారనుంది

పశ్చిమ దిశగా పయనించి రేపు సాయంత్రానికి ఉత్తరాంధ్ర (విశాఖ) – దక్షిణఒడిశా(గోపాల్ పూర్) మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో ఈరోజు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు , అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం.

ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వెేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

రేపు ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 70 -90 కీమీ వెేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.

సముద్రం అలజడిగా ఉంటుంది.మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– కె.కన్నబాబు,కమిషనర్ విపత్తుల శాఖ, ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *