దీపావళి వరకు ఖాళీలను భర్తీ చేయండి. లేకపోతే నిరుద్యోగులతో మిలియన్ మార్చ్ చేస్తామని ప్రజాసంగ్రామ యాత్రలో తెలంగాణ బిజెపి నేత బండి సంజయ్ హెచ్చరించారు.
సిరిసిల్ల రాజాంబ జిల్లా తంగాళ్లపల్లి లో మాట్లాడుతూ, ముఖ్య మంత్రికి కమిషన్ ల మీద దృష్టి నోటిఫికేషన్ ల మీద ఎందుకు లేదు అని ప్రశ్నించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
బంగారు తెలంగాణ కాదు బతుకుదెరువు తెలంగాణ కావాలి.
మీ ఇంటికే ఉద్యోగాలా? నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వద్దా?
జాబ్ కేలండర్ ను వెంటనే విడుదల చేయాలి.
క్లబ్ లు, పబ్ ల మీద ఉన్న ధ్యాస జాబ్ ల మీద ఎందుకు లేదు.
నిరుద్యోగ భృతి ఇస్తారా లేక 2023 తరువాత మీకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి వస్తది.
ఇంటికో ఉద్యోగం హామీ ఏమైంది?
లక్ష ఉద్యోగాల హామీ ఏమైంది?
టీ హబ్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాల కంటే రాష్ట్రంలో పబ్ లు ఎక్కువ తెరిచారు.
ఏడేళ్లలో ఒక్క డి ఎస్సి లేదు. ఒక్క గ్రూప్ 1, గ్రూప్ 3, 4 నోటిఫికేషన్లు లేవు
బీసీ, ఎస్సి, ఎస్టీ నోటిఫికేషన్ ల పై శ్వేతపత్రం విడుదల చేయాలి.
కమిషన్ ల కోసం 70 వేల జి ఓ లను మాయం చేస్తరు. కానీ ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క జి ఓ ఇవ్వరు.