తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో అక్టోబరు 6 నుండి 8వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం అక్టోబరు 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో పవిత్రోత్సవాలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు.
యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 6న పవిత్రప్రతిష్ఠ, స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రెండో రోజు అక్టోబరు 7న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు. చివరిరోజు అక్టోబరు 8న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, స్నపనతిరుమంజనం, చక్రస్నానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. అదేరోజు సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లను ఆలయంలో ఏకాంతంగా ఊరేగిస్తారు.
తరిగొండ ఎక్కడ ఉంది?
తరిగొండ చిత్తూరు జిల్లాలో, వాయల్పాడు-గుర్రం కొండ దారిలో వాయల్పాడుకు 6 కిలో మీటర్ల దూరాన ఉంటుంది. ప్రముఖ భక్తి కవయిత్రి తరిగొండ వెంగమాంబ వల్ల ఈ వూరు ప్రఖ్యాతి పెరిగింది. ఇక్కడి ఆలయంలో మూడు శాసనాలు ఉన్నాయి. మొదటి శాసనం 1559 నాటిది. దీనిని రాయించినవాడు విజయనగరరాజు సదాశివదేవ మహారాయ. ఈ శాసనం ప్రకారం, ఇక్కడి ఆలయాన్ని 1557లో నిర్మించినట్లు తెలుస్తుంది. 1846కు చెందిన మరొక శాసనం వల్ల ఇక్కడి హోమశాల, వంటగది భాస్కరాచాచర్య శిష్యుడైన ఎర్రప్ప నిర్మించినట్లు తెలుస్తుంది. మూడో శాసనం 1862 నాటిది. లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకోసం క్రిష్ణమ శెటి అనే భక్తుడు ఇక్కడ కల్యాణమంటపం నిర్మించాడు. అయితే, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించాలరో తెలిపే శాసనాలు లభ్యం కాలేదు.
తరిగొండ వెంగమాంబ (ఏప్రిల్ 20,1730- ఆగస్టు 21,1817): ఆమె పూర్వీకులది కర్నూలు జిల్లా కానాల గ్రామం. మీరాబాయి అవతారంగా ఆమె క్రిష్ణయ్య, మంగమ్మలకు జన్మించిందని భక్తులు నమ్ముతారు. ఆమె కూడా మీరాబాయిలోగే దైవభక్తి ‘పిచ్చి’లో పడిపోయింది. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని తల్లితండ్రులు భావించారు. ఇంజేటి వెంకటాచలపతి అనే వరుడిని వెదికారు. అయితే, ఆమె మనసు మాత్రం తిరుమల వెంకటాచలపతి మీద లఘ్నమయి ఉంది.తన మనుసునిండా తిరుమల వెంకటాచార్యుడే ఉన్నాడని పెళ్లయ్యాక ఆమె భర్తకు నేరుగా చెప్పింది. తర్వాత తిరుమలేశుడిని వెదుక్కుంటూ అడవుల గుండా తిరుమల కు ప్రయాణమయింది. మార్గమధ్యం మొగిలిపెంట ఆంజనేయ స్వామి నిదర్శించింది. తర్వాత వెంకటాద్రి చేరుకుంది. తర్వాత ఆమె తుంబుర తీర్థం వెళ్లింది. అక్కడ ఒక గుహలో 12 సంవత్సరాలు తపస్సు చేసింది.
అనంతరం ఆమె తరిగొండ మాతృశ్రీ వెంగమాంబదేవిగా తిరుమలకు తిరిగొచ్చింది. అక్కడే చివరి దాకా ఉన్నారు. ఆమె భక్తికి మెచ్చి తిరుమలేశుడు ఆమెకు ఆలయ ప్రవేశం కల్పించి ఆమె కృతులు విన్నాడని విశ్వాసం. ఆలయం మూసేసిన తర్వాత ఆమెతన కృతులను శ్రీవారికి వినిపించి, హారతి పట్టికానుక ముత్యాలు బహూకరించేదని చెబుతారు.
మరుసటి రోజు ఈ ముత్యాలనుచూసిన వారు ఎవరో లోనికి వస్తున్నారని భావించిన విచారణ చేస్తారు.చివరకు వెంగమాంబయే లోనికి ప్రవేశిస్తున్నదని ఆమె తిరుమలనుంచి తుంబురు కోనకుబహిష్కరించారని ఒక గాథ ప్రచారం ఉంది. తరిగొండ నృసింహశతకం ఆమె మొదటి కృతి. తరువాత ‘నృసింహ విలాస కథ’, ‘శివనాటకం’ ’బాలక్రిష్ణ నాటకం‘, యక్షగానం, రాజయోగమృతసారం అనే ద్విపద కావ్యం రాశారు. తర్వాత తుంబురు కోన నుంచి తిరుమల వచ్చి విష్ణు పారిజాతం, చెంచునాటకం, రుక్మిణి నాటకం తదితర రచనలు చేవారు.
వెంగమాంబ హారతి
తిరుమలేశుడు ఆమె తన భక్తురాలిగా స్వీకరించినందున ప్రతిరోజు ఏకాంత సేవలో వెంకమాంబ హారతిని కొనసాగిస్తున్నారు. ఆమె వారసులు ఇప్పటికి ముత్యాలను రుసుం దేవుడికి చెల్లిస్తూనే ఉన్నారు. ఏడు కొండలవాడు సుప్రభాతాన అన్నమయ్య కీర్తనలతో నిద్రలేస్తే, రాత్రి వెంగమాంబ ముత్యాల హారతి అనంతరం శయనిస్తాడు.
వెంగమాంబతపస్సు చేసిన తుంబురు కోన గురించి కింద చదవండి
https://trendingtelugunews.com/top-stories/features/trekking-to-tumburu-kona-tumburu-tirtham-near-tirupati/