కొంతమంది జర్నలిస్టుల మీద, యాక్టివిస్టుల మీద కేంద్ర ప్రభుత్వం పేగసస్ స్పై వేర్ ను ప్రయోగించి ఫోన్ లు టాప్ చేసిన విషయం మీద దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దర్యాప్తు ను ఒక టెక్నికల్ కమిటీ జరుపుతుంది. టెక్నికల్ కమిటీ సభ్యుల వేట మొదలయింది. సభ్యుల నియామకం తొందర్లో పూర్తవుతుంది. దీని మీద వచ్చే వివరంగా ఉత్తర్వులు వెలువడతాయి.
ఈ విషయాన్ని గురువారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ప్రకటించారు.
తమ ఫోన్ లను టాప్ చేశారని, ఇది పౌరహక్కులకు, ప్రైవసీకి భంగమని చెబుతూదీని మీద సమగ్ర విచారణ జరపాలని కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఒక పిటిషన్ కు సీనియర్ న్యాయవాది చందర్ ఉదయ్ సింగ్ ప్రతినిధి. ప్రధాన న్యాయమూర్తి ఈ రోజు కోర్టు నిర్ణయాన్ని ఉదయ్ సింగ్ కు తెలిపారు.
కోర్టు ఈ వారమే ఉత్తర్వులు జారీ చేసే ఉండేదని, ఈ దర్యాప్తునకు ఉద్దేశించిన నిపుణుల కమిటీలో చేరేందుకు వ్యక్తి గత కారణాల వల్ల కొంతమంది నిరాకరించారని, దీనితో కమిటీ ఏర్పాటు ఉత్తర్వులను వచ్చే వారం జారీ చేయాలనుకుంటున్నట్లు జస్టిస్ రమణ తెలిపారు.
“టెక్నికల్ కమిటీ సభ్యులను తొందర్లోనే ఎంపిక చేస్తాం.వచ్చే వారం ఉత్తర్వులు జారీ చేస్తాం,’ అని ప్రధాన న్యాయమూర్తి రమణ తెలిపారు.
ఈ పిటిషన్ల వ్యవహారాంలో కేంద్రం ఒక విచిత్రమయన వైఖరి తీసుకుంది. ఫోన్ల్ ను ట్యాప్ చేశామని వేసిన పటిషన్ల మీద కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలనికోర్టు అదేశించినపుడు అఫిడ్ దాఖలు చేయలేమని కేంద్రం నిలిపింది.
పేగసస్ స్పైవేర్ ను జర్నలిస్టులమీద, యాక్టవిస్టుల మీద ప్రయోగించామో లేదో తాము బయటకు వెల్లడించలేమని, అది దేశ భద్రత వ్యవహారమని కేంద్రం తప్పించుకుంది. పేగసస్ స్పైవేర్ ను ఉపయోగించామో లేదో అఫిడవిట్ లో వెల్లడించలేమని, ఇది దేశభద్రత వ్యవహారమని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా కోర్టు నివేదించారు.
దీనితో ఈ నెల 13 వ తేదీన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం తన ఉత్తర్వులను రిజర్వు చేసింది.
దీనికి స్పందిస్తూ, ‘కోర్టు దేశభద్రతకు, సైన్యానికి సంబంధించిన విషయాలను వెల్లడించాలని కోర్టు కోరడంలేదు. కేవలం పౌరుల మీద పేగసస్ స్పై వేర్ ను ప్రయోగించారా లేదా అనే విషయాన్ని మాత్రం తెలుపుతూ అఫిడవిట్ వేయమంటున్నది,’ అని బెంచ్ తెలిపింది.