Skip to content– ప్రొఫెసర్ లీ సూ ఫెంగ్ (Prof Lee Tzu Pheng)
అనువాదం : రాఘవ శర్మ
కాస్త టీతాగు
చక్కగా నిదానంగా
వెళ్ళిపోడానికి సమయం
ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు
ఆ వెలుగును ఆస్వాదించడానికి
ఇక సమయం చాలదు
కాస్త టీ తాగు
చక్కగా, నిదానంగా
ఎంతో చిన్నది జీవితం
అనుభవాలు చాలా కాలం
అందంగా అలా ఉండిపోతాయి
చేయడానికి ‘అతి’ చాలా ఉంది
చాలా తప్పులు జరుగుతున్నాయి
ఎంతో బలపడాలని
చాలా కాలంగా కసరత్తు చేస్తుంటాం
ఇప్పటికే` చాలా ఆలస్యమైపోయింది
వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది
కాస్త టీ తాగు
చక్కగా, నిదానంగా
కొందరు స్నేహితులు నీతో ఉంటారు
కొందరు వెళ్ళిపోతుంటారు
ఒకనాటి ప్రేమ చాలా గొప్పది
కానీ, అందరూ నీతో ఉండరు
పిల్లలు ఎదుగుతారు
రెక్కలొచ్చి ఎగిరిపోతారు
నిజానికి చెప్పడానికి ఏమీ లేదు
కొన్ని సంఘటనలు జరిగిపోతుంటాయి అంతే
కాస్త టీ తాగు
చక్కగా, నిదానంగా
ప్రపంచం కోసం
నక్షత్రాలకతీతంగా
అంతమయ్యేనాటికి
ప్రేమను అంతా అర్థం చేసుకుంటారు
పొగడ్తలు, విలువలను ఎవరు లెక్కేస్తారు
నీ బాధలన్నీ పోయేలా
ఒక చిరునవ్వు నవ్వి,
గట్టిగా గాలి పీల్చు
కాబట్టి
కాస్త టీతాగు…
( ప్రొఫెసర్ లీ సూ ఫెంగ్, సింగపూర్ కల్చరల్ మెడాలియన్ బహుమతి గ్రహీత)
(ఆలూరు రాఘవశర్మ, కవి, రచయిత, జర్నలిస్టు, తిరుపతి)