ఏటవాలుగా ఉన్న కొండమీది నుంచి కిందికి దొర్లుతున్న భారీ ఆరెంజ్ బంతి ఇది, అవునా. అట్లే అనిపిస్తుంది. కాని, బంతి కాదు.ఇది ఉదయస్తున్న సూర్యుడు. కొండచాటునుంచి పొడుచుకువస్తున్న పొద్దును, కొండమీది చెట్ల మీదుగా, ఒకరిద్దరు మనుషులు కూడా కనిపించేలా తీసిన అద్భతమయిన ఫోటో ఇది.
ఈ ఫోటో ఎంత స్పష్టంగా వచ్చిందటే ఇందులో 5 సూర్యుడి మచ్చలు (Sunspots) కూడా కనబడుతున్నాయి. ఇదే ఈ ఫోటో విశేషం. ఈ ఫోటో తీస్తున్నపుడు సూర్యుడు సోలార్ మినిమమ్ (Solar Minimum)లో ఉన్నాడు. సాధారణంగా సోలార్ మినిమమ్ లో మచ్చలు కనిపించవు. అలాంటిది, ఇపుడు 5 మచ్చలు కనబడుతున్నాయి.సూర్యుడు 11సంవత్సరాల జీవిత చక్రం తో ఉంటాడు.ఈ దశలో ఆయన మచ్చలు పెరగడం, తరగడం జరగుతుూ ఉంటుంది. మచ్చలు ఎక్కువగా ఉన్నదశను సోలార్ మాగ్జిమమ్ (Solar Maximum) అంటారు. ఇపుడు మనం సోలార్ మినిమమ్ లో ఉన్నాము. అయినా సరే, 12 రోజుల కిందట ఈ ఫోటో తీసేనాటికి సూర్యుడి మీద 5 మచ్చలు కనిపించడం విశేషం.
సన్ స్పాట్స్ అంటే ఏమిటి?
సూర్యూడి ఉపరితలం మీద కనిపించే మచ్చలే సన్ స్పాట్స్. ఈ మచ్చలు నల్లగా ఎందుకు కనిపిస్తాయంటే, మండుతున్న సూర్యోగోళం మీద ఇతర ప్రదేశాలతో పోలితేే చల్లటి ప్రదేశాలివి. పేరుకే చల్లటివి గాని, ఇక్కడ ఉష్ణోగ్రత 6500 డిగ్రీల్ ఫారిన్ హీట్ దాకా ఉంటుంది. సూర్యడి మీద అయస్కాంత క్షేత్రబలంగా ఉన్న చోటో ఈ మచ్చలేర్పడతాయి. ఇక్కడ ఆయస్కాంత శక్తి చాలా బలంగా ఉన్నందున సూర్యుడిలోపలినుంచి ఉష్ణం ఈప్రదేశాలలకు రాకుండా అడ్డుకుంటుంది. అందుకే ఇవి కొద్ది తక్కువ ఉష్ణోగ్రతతో ఉంటాయి.
ఇది స్పెయిన్ సీయెరా డెల్ సిడ్ అనే కొండమీది ఫోటో. చెట్ల, మనుషుల నీడలు ఫోటోకి మరింత అందం తీసుకువచ్చాయి.
నిజానికి ఈ మనుషులు ఫోటోగ్రాఫర్ సోదరులే. ఈ దృశ్యాన్ని కొండనుంచి 3.6 కిమీ దూరాన్నుంచి ఫోటకెక్కించారు. ఇది సింగిల్ ఎక్స్ పోజర్ ఇమేజ్. 12 రోజుల కిందట తీసిన ఫోటో ఇది. ఫోటో తీసిన నిమిషాల్లో సూర్యుడు ఆకాశంలోకి ఎగిరాడు. ఒక వారంలోపు ఈసన్ స్పాట్స్ సూర్యుని చుట్టూ తిరగుతూ పోయి మాయమయ్యాయి. అయితే, ఈ ఫోటోలో మాత్రం అవిశాశ్వతంగా మిగిలిపోయాయి.
(Image credit and copyright: Jordi Coy )