వరి పంట పండిస్తే రైతుకు ఉరి అని ముఖ్యమంత్రి అనడం ఏమాత్రం సమంజసం కాదని సిఎల్ పి నాయకుడు భట్టి మల్లు విక్రమార్క అన్నారు.
పంటలను మార్కెటింగ్ చేసుకోవాలి తప్ప, మానేసి రైతులను సంక్షోభంలో పడేయరాదు.
‘ఢిల్లీలో ఉన్నాయన వద్దన్నారని.. ఇక్కడ ఉన్నాయన కొనను అంటే ఎలా?ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగైతే వరి ధాన్యం కొన్నామో, ఇప్పుడు కూడా అలాగే కొనాలి. రాష్ట్ర రైతాంగం ఆందోళనలో ఉన్నారు.. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. అసంబద్ధ మైన మాటలు మాటలు కరెక్ట్ కాదు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో రాష్ట్ర రైతాంగం ఆందోళన చెందుతోంది,’ అని భట్టి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.