ఇక కుమ్మరి వృత్తి వారికి KCR వరాలు…

 

*హుజురాబాద్ నియెజకవర్గంలోని ప్రతీ మండలానికి మాడర్న్ పాటరీ కిల్ను

*ఉత్తర్వులు జారీ చేసిన బిసి కార్పోరేషన్ ఎండీ అలోక్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలోని కుమ్మరి శాలివాహన కులవ్రుత్తులు నిర్వహించే వారికి కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.

ఆధునిక పాటరీ యంత్రాలపై ప్రభుత్వం అందించిన శిక్షణ పూర్తి చేసుకున్న320 కుమ్మరి వ్రుత్తి కళాకారులకు  యంత్రాలను మంజూరు చేసింది, వీరితో పాటు హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ప్రత్యేకంగా మండలానికి ఒకటి చొప్పున ఆధునిక కుండల భట్టీలను మంజూరు చేసింది.

రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు బిసి కార్పోరేషన్ ఎండి అలోక్ కుమార్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసారు. దీని ద్వారా మట్టిపాత్రలు, మట్టి నీళ్ల కూజాలు, వాటర్ బాటిల్లు, టీకప్పులు, మట్టి విగ్రహాలు, మట్టి దీపకుండీలు, ఇతరత్రా అలంకరణ సామాగ్రి అత్యంత వేగంగా వివిద డిజైన్లతో చేయడానికి వీలు కుదురుతుంది. శాలీవాహన కుమ్మరి కులస్థుల ఆదాయం పెంచడానికి తోడ్పడే ఈ చర్య వల్ల ఒక్కొక్కరికి లక్ష రూపాయల విలువ గల ఆదునిక పాటరీ యంత్రాలు 80వేల సబ్సీడీతో అందుతాయి. ప్రభుత్వం అందించిన శిక్షణ అనంతరం 320 మంది తమవాటాగా 20వేల రూపాయల్ని జమచేయడం జరిగింది. ఇటు హుజురాబాద్ నియెజకవర్గంలోని కుమ్మరి వ్రుత్తిదారుల జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు వారికి ఆర్థిక స్వావలంబనకు మాడర్న్ పాటరీ కిన్లు ఉపయోగపడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *