ఉచితంగా కందుకూరి వీరేశలింగం వర్ధంతి పుస్తకం

‘అభినవాంధ్రకు వేగు చుక్క ‘

సొసైటీ ఫర్ సోషల్ చేంజ్, నెల్లూరు. ( శ్రీ వీరేశలింగం శతవర్ధంతి సంస్మరణ సంపుటి ప్రచురణ సంఘం) వారు ఒక గొప్ప పను చేస్తున్నారు.

*వీరేశలింగం పంతులు గారి మీద ఆరుద్ర, కొ. కు, తిరుమల రామచంద్ర, సోమసుందర్, వకుళాభరణం రామకృష్ణ, జాషువా, కృష్ణశాస్త్రి, చిలకమర్తి వంటి ప్రముఖ రచయితలతోబాటు, ఇతర విశ్లేషకుల రచనలు కలిపి 57 వ్యాసాల సమాహారం ఈ శతవర్ధంతి సంస్మరణ సంపుటి తీసుకువస్తున్నారు

ఈ పుస్తకం ప్రస్తుత ధరల ప్రకారం మార్కెట్లో రెండు వందల రూపాయలకు తక్కువ ఉండదు. అయినాసరే, ఈ విలువయిన పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నారు.

*Quarto సైజ్ లో, విలువైన వ్యాసాలు గల 192 పేజీల ఈ పుస్తకాన్ని , పోస్టల్ చార్జీల  40 రూపాయలు పంపితే మీ అడ్రెస్ కు ఉచితంగా పంపిస్తారు. వీరేశలింగం గారిని, ఆయన భావజాలంను ఈ తరానికి పరిచయం చేసేందుకు ఈ పని చేస్తున్నారు.

సొసైటీ కృషి అభినందనీయం.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *