ఒంగోలు ట్రాఫిక్ ఇలా ఉంటుంది

 

( కొల్లా మధు )

ఒంగోలు నగరంలో ఆక్రమణలు అన్ని తొలిగిస్తున్నాం అని రెండు సంవత్సరాలు క్రితం డిసెంబర్ లో భారీగా ప్రకటన లు చేసి ఒక్క రోజు పత్రికలలో , మీడియా లో ఆక్రమణలు తొలిగిస్తున్నాం అన్నారు రెండో రోజు నుంచి ఎక్కడ కూడ కనబడలేదు ఉన్నతాధికారులు ఆదేశాలు ఎక్కడ అమూలు కాలేదు. అయితే ఇలాంటి ప్రకటనలు చాల సార్లు చూస్తారు నగర ప్రజలు . కొత్త నగర పాలక సంస్థ పాలక వర్గం వచ్చింది . ఒంగోలు నగరలో ఆక్రమణలు తొలిగించి కొత్త అందాలతో మరియు ఆరోగ్యం తో పాటు ట్రాఫిక్ సమస్యల నుంచి నగర ప్రజలకు సౌకర్యాలు కల్పించడం సాధ్యం కాదా ??

ఒంగోలు పట్టణంలో చాల చోట్ల రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు సుందరీకరణ చేపట్టారు గతంలో . అయితే ఎక్కడ పూర్తిగా ఆక్రమణలు తొలగించకుండ కొన్ని చోట్ల డిజిటల్ లైటింగ్ , వైడల్పు అయిన రోడ్లు అందంగా చిన్న డివైడర్ వేసి మధ్యలో గ్రీనరీ సెంటర్స్ లో అందమైన డిజిటల్ లైటింగ్ వరకు పరిమితం అయింది . చాల సెంటర్స్ లో ఫుట్ పాత్ లు నిర్మాణం , 17 సెంటర్స్ లో వాటర్ ఫౌంటెన్ లు నిర్మాణం చేస్తాం అన్నారు స్పెషల్ ఆఫిసర్ గా జిల్లా కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎందుకో పూర్తిస్థాయిలో అములు జరగలేదు .

నగరం అభివృద్ధి అయ్యే కొద్ది జనాభా ,వ్యాపారాలు , విద్యా సమస్ధలు ,మాల్స్ ,మల్టీప్లెక్స్ లు , స్టార్ హాటల్స్ , చిన్న పెద్ద వాహనాలు రోజు రోజుకు సంవత్సరం సంవత్సరం వేలాది స్కూటర్స్ ,కార్లు ,ఓల్వా బస్సులు , మల్టీ ప్లెక్స్ లు , బస్సులు , ఆర్.టి.సి బస్సులు , సరుకుల రవాణా వాహనాలు , టిప్పర్ లు ,నీటితో పాటు చిరు వ్యాపారం చేసుకొనే తోపుడు బళ్ళు , వేలాది ఆటోలు , వందల కొద్ది ప్రైవేట్ బస్సులు ,ఆసుపత్రుల అంబులెన్స్ లు ఇన్ని ఒంగోలు నగరంలో ఉంటే ఇప్పుడు ఉన్న రోఢ్డులు 10 నుంచి 15 సంవత్సరాలు ముందు వరకు సరిపడేవి .కానీ ఇప్పుడు నగరంలో చాల మార్పులు వచ్చాయి దానికి అనుగుణంగా వెడల్పుగా రోడ్డు లు లేకపోవడం చాల విచార కరం . ప్రైవేట్ ,ప్రభుత్వ స్కూల్ ,కాలేజీలు ,ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వేలాది మంది రోజు ఉదయం సాయంత్రం ట్రాఫిక్ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు , వర్షాలు కురుస్తున్నాయి . సాయంత్రం పూట ఇరుకైన రోడ్లు , ఆటోలు , బస్సులు , మోటార్ బైక్ లు వర్షంలో తడుస్తూ ఎక్కడ నిలబడానికి వీలు ఉండదు వాళ్ళ కష్టాలు చెప్పలేని అన్ని.

కరోనా వైరస్ తరువాత నగరం లాక్ డౌన్ ఉండం వలన నగరంలో ట్రాఫిక్ సమస్య తక్కువగా ఉంది కానీ ఇప్పుడు లాక్ టౌన్ ఎత్తి వేసిన తరువాత ఇప్పుడు నగరంలో ఏ రోడ్డు చూసిన విపరీతంగా ట్రాఫిక్ సమస్య నగరంలో పార్కింగ్ సమస్య కూడ ఉంది నగరంలో ట్రాఫిక్ పోలిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఎక్కడ రోడ్డు లు వైడల్పు లేకపోవడంతో నగరంలో ప్రజలు చిన్న , పెద్ద వాహనదారులు పార్కింగ్ సమస్య వలన ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాహనాలు మార్జీన్లు దాటి వాహనాలు పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ వాహనం తీసుకొని పోతుంది దానితో పాటు ఫోటోలు తీసి ఫైన్ వేస్తున్నారు . నగర పాలక సంస్థ మరియు టౌన్ ప్లానింగ్ విభాగం వారు సరైన ప్రణాళికలు రూపొందిచక చేయకపోవడం తో ఒక్క వెళ్ళ మాస్టర్ ప్లాన్ రూపొందించిన ఎక్కడ అమూలు పరుస్తున్న సందర్భం కనబడంలేదు దానికి తోడు రాజకీయ కారణాలు బుచ్చి గా చూపిస్తున్నారు కొంత ఉంటే ఉండవచ్చు కానీ దానిని అలుసుగా తీసుకొని విపరీతంగా అవినీతి ఆరోపణలు వస్తున్న లెక్క చేయ్యకపొవటం వీరి వలన నగరంలో రోడ్లులు వెడల్పు లేకపోవడంతో పార్కింగ్ స్ధలం కేటాయించక పోవడంతో నగరంలో ప్రజలు , వాహనదారులు ఫైన్ లతో శిక్ష అనుభవిస్తున్నారు .

ఒంగోలు నగరంలో నివాసం ఉన్న 3.5 లక్షల మంది కి నష్టం జరిగినా వీళ్ళకు అవసరం లేదు . పూర్తిగా రాజకీయ మరియు ఆర్థిక అంశాలతో ముడి పడి ఉంటాయి .

గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధుల జిల్లాలో పర్యాటన లతో పోలీస్ కాన్వాయ్ తో నగరంలో ముందే ఇరుకైన రోడ్డు లు అందులో వస్తున్నారు అంటే 10 నిమిషాలు ముందు నుంచి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ని ఆపుతున్నారు .ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారం వస్తుందో చూడాలి . నగరంలో ఆక్రమణలు అన్ని తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండ చూస్తారో లేకపోతే మాకు ఇలాంటి ఏమి పట్టవు అనుకుంటే ప్రజలు ఇప్పుడు ఉన్న రోడ్డులు రెండు మూడు సంవత్సరాలు వరకు మాత్రమే ఉపయోగ పడుతుంది తరువాత మీ వాహనాలు అని ఇంట్లో పెట్టి నడుచుకొని ఉద్యోగానికి , పనులు కి బజారు కి ,సినిమా లకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది అని కొంత మంది అధికారులు ,నిపుణుల మాటలు . ఇక్కడ నాకు వ్యక్తిగతంగా ఉపయోగం లేదు నా జిల్లా నా‌ నగరం ఇతర జిల్లా లాగ అభివృద్ధి , ఆరోగ్యం ,ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని ఉద్దేశ్యం.

ఒక పని జరిగితే నాలుగు రకాలుగా ప్రజలకు ఉపయోగపడాలి. ఒక మంచి నిర్ణయం వలన 20 నుంచి 30 సంవత్సరాల పాటు నగరంలో ప్రజలు ఆ నాయకుడు ని మేచ్చుకోవాలి తిట్టుకుంటూ రోడ్డు మీద ప్రయాణం చెయ్యకూడదు . ఇప్పుడు కురుస్తున్న వర్షం వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు వారితో పాటు ఈ పరిస్థితి కి కారణం అయిన రాజకీయ నాయకులు పార్టీలు , అధికారులు ,ఉద్యోగులను తో పాటు తిట్టుకుంటు ఉన్నారు. స్ధానికంగా ప్రజలు ఇప్పటి కైనా ఆలోచన చేయ్యాలి అని నగరంలో ప్రజలు కొరుకుంటు ఉన్నారు .

ఒంగోలు నగరం లో కొన్ని రోడ్లు .

1 . అద్దంకి బష్టాండ్ నుంచి బండ్ల మిట్ట సెంటర్ .

2. పి.వి.ఆర్ హైస్కూల్ సెంటర్ నుంచి అంజయ్య రోడ్డు చివర వరకు , సెంటర్ నుంచి రంగరాయుడు చెరువు సెంటర్ వరకు .

3.సాయి బాబ గుడి నాలుగు రోడ్ల సెంటర్ నుంచి మంగమూరు రొడ్డు , బైపాస్ సెంటర్లో ఫౌంటెన్ నిర్మాణం

4.బైపాస్ నుంచి ఆశ్రమం వరకు .

5.సాయిబాబ గుడి సెంటర్ నుంచి గద్దలగుంట పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సెంటర్

6.సెంట్ ధెరీసా సెంటర్ నుంచి పోతురాజు కాల్వ వరకు .కిమ్స్ ఆసుపత్రి వరకు (పనులు జరిగిన పూర్తిగా పనులు జరగలేదు .

7 .గ్రంధాలయం రోడ్డు 80 అడుగుల గా పనులు మొదలు అయ్యింది కానీ కొంజేడు బస్టాండ్ వరకు డివైడర్ సెంటర్ లైటింగ్ .

8.అంజయ్య రోడ్డు నుంచి వంటవారి కాలనీ నుంచి కొత్త మార్కెట్ కి కలపాలి కొంత రోడ్డు వెడల్పు చెయ్యాలి .

9. పాత్ర మార్కెట్ నుంచి కొత్త పట్నం సెంటర్ వరకు . మస్తాన్ దర్గా నుంచి మిరియాల పాలెం సెంటర్ వరకు .

10. మిరియాల పాలెం సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఏనుగు చెట్టు నుంచి సి.వి.యన్. రీడింగ్ రూం వరకు .

11.రంగారాయుడు చెరువు దగ్గర ఫ్రాన్సీ గుడ్స్ హాల్ నుంచి ట్రంక్ రోడ్డు వరకు .

12. ట్రంక్ రోడ్డు నుంచి హౌసింగ్ బోర్డు చివరి వరకు .

13. గోపి కృష్ణ సినిమా హాల్ రెండు వైపు ల .

14 మిరియాల పాలెం సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు .

15. పోతురాజు కాల్వ రెండు వైపుల రోడ్డు నిర్మాణం.

16. పాత ఇందిరా గాంధీ లా కాలేజీ నుంచి వి.ఐ.పి రోడ్డు చివరి వరకు .

17. బైపాస్ నుంచి S.S.N కాలేజీ మధ్య రోడ్ పూర్తి స్థాయిలో చేయ్యలి .

ఈ నెల 8 వ తేదీన నగర పాలక సంస్థ పాలక మండలి సమావేశం జరుగుతుంది అని పత్రికలలో వార్తలు వచ్చాయి ఈ సమస్య లు పైన కూడ పూర్తి స్థాయిలో చర్చ జరగాలి ట్రాఫిక్ సమస్యలతో ఫైన్ లతో ఇబ్బందులు పడుతున్నారు శాశ్వతంగా పరిష్కారం జరగాలని నగర ప్రజలు కోరుతున్నారు .

(కొల్లా మధు , ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *