సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా గండి క్షేత్రం లో యథావిధిగా దర్శనాలు మొదలయ్యాయి.
రాష్ట్రంలో అంజనేయ క్షేత్రాలలో అతి ముఖ్యమయినదిగా శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి పేరుంది. కరోనా ఆంక్షలతో పాటు శ్రావణ మాసం రద్దీ కారణంగా కుదించిన వీరాంజనేయ స్వామి వారి దర్శనాలను సెప్టెంబర్ 7వ తేదీన నుంచి పునరుద్దరిస్తున్నారు. ఇక నుంచి ప్రతిరోజు దర్శనాలు ఉంటాయని, నేటినుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతున్నందున ఆలయ అధికారి ముకుంద రెడ్డి తెలిపారు స్వామివారి దర్శనం 7.9.2021 తేదీ నుండి వీరంజనేయ స్వామి వారి దర్శన వేళలు:
*ఉదయం.5నుండి మధ్యాహ్నం.1 వరకు మొదటి విడత
*తిరిగి మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8గంటల వరకు రెండో విడత స్వామి వారి సర్వదర్శనం ఉంటుంది.
శ్రావణ మాసoలో భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి ఆలయ దర్శన వేళలు కుదించడం జరిగిందని ఆయన తెలిపారు.
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి యథావిధిగా దర్శనాలు, పూజలు, అభిశేకాలు ఉంటాయి అని ఆయన