మావోయిస్టు బాంబు పేలుడులో ఒకరికి గాయాలు

భద్రాచలం : మావోయిస్టులు పోస్టర్లపక్కన అమర్చిన బాంబు పేలడంతో పూజారిగూడెం గ్రామానికి చెందిన బ్రహ్మనాయుడు అనే యువకుడు గాయపడ్డాడు.

చర్ల శివారు లెనిన్ కాలనీ సమీపంలోని మామిడితోట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది .

ఈనెల 13 న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే డిమాండ్ లో మామిడితోట వద్ద పలు చెట్లకు మావోయిస్టు పార్టీ చర్ల – శబరి ఏరియా కమిటీ పేరుతో పోస్టర్లు వెలిశాయి .

ఆలం ఆదివారం ఉదయం పూజారిగూడెం నుంచి లెనినాకాలనీ వైపు తన ద్విచక్రవాహనంపై వెళ్తున్న బ్రహ్మనాయుడు రోడ్డు పక్కన చెట్టుకు ఉన్న పోస్టర్ గమనించాడు .

అందులో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో వాహనంపైనే పోస్టరు ఉన్న చెట్టు చెంతకు వెళ్ళి మ్యాటర్ చదువుతుండగా అకస్మాత్తుగా బాంబు పేలడంతో ఎగిరి రోడ్డుపై పడ్డాడు .

రక్తస్రావంతో ఉన్న అతడిని హుటాహుటిన బాటసారులు చర్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు . పోస్టర్ల చెంత మావోయిస్టులు బాంబులు పెట్టడం అందరిని విస్మయపరుస్తున్నది. ఎందుకంటే,గతంలో ఎపుడూ ఇలాంటిసంఘటన లేదు

ఇది సామాన్యుల ప్రాణాలకు ముప్పు కలిగించే విషయం.  ఈ ఘటన నేపథ్యంలో మావోయిస్టుల చర్య పట్ల ఏజెన్సీ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *