సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు కేశవ్ దేశిరాజు మృతి

దేశమంతా ఈ రోజు డాక్టర్ సర్వేపల్లిరాధాకృష్ణన్ కు నివాళులర్పిస్తూ ఉంది.  అయితే, మరొక వైపు ఆయన మనవడు , కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ సెక్రెటరీ కేశవ్ దేశిరాజు ఈ రోజు చెన్నైలో చనిపోయారు. హృదయ సంబంధమయిన జబ్బుతో ఆయన ఈ ఉదయం చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలోచనిపోయారు.

ఆయన 1978  సంవత్సరపు బ్యాచ్ కు చెందిన ఉత్తరాఖండ్ క్యాడర్ ఐఎఎస్ అధికారి.  ఆయన కేంద్రంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు ఆయన వయసు 66 సంవత్సరాలు. రైటరయ్యాక పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PFI)పాలక మండలి ఛెయిర్మన్ గా నియమితులయ్యారు.

ఆయనకు చాలా నిజాయితీరుడైన అధికారి అనే పేరుంది. రాజీలేని మనస్తత్వం అని ఆయనతో పరిచయం ఉన్న ఆయన బ్యాచ్ కు చెందిన రైటర్డు అధికారులు చెబుతారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్నపుడు ఆయన పలుకార్యక్రమాలను విజయవంతంగా రూపొందించారు. అమలుచేశారు. ఆయన మృతితో మానసిన రోగులు గొప్ప మిత్రుని కోల్పోయారు.ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను, కమ్యూనిటీ హెల్త్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు.
ఆయన ఎకనమిక్స్ లో కేంబ్రిడ్జి నుంచి మాస్టర్ట్స తీసుకున్నారు. తర్వాత హార్వర్డ్ జాన్ ఎఫ్ కెన్నెడీ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబిఎ చేశారు 1978లో ఐఎఎస్ కు ఎంపికయ్యారు.

2016లో వచ్చిన మెంటల్ హెల్త్ కేర్ బిల్ (Mental Healthcare Bill 2016) వెనక ఆయన కీలకపాత్ర పోషించారు. ఆయన గొప్ప సంగీతప్రియుడు.  కర్నాటక సంగీత విధుషీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి మీద  ఆయన “Of Gifted Voice”అనేపుస్తకం రాశారు. భారతదేశ వైద్యరంగంలో ఉన్న అవినీతి మీద  సమీరన్ నంది,  సంజయ్ నగ్రల్ తో కలసి ఆయన “Healers or Predators? Healthcare corruption in India”అని పుస్తకంకూడా రాశారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *