ఎన్నికల కమిషన్ ఉపఎన్నికల నిర్వహణపై తమ నిర్ణయాన్ని రాజకీయ దృక్పథంతో కూడిన రాష్ట్రప్రభుత్వాల అభిప్రాయలపై ఆధారపడకుండా స్వతహాగా వాస్తవ పరిస్తితులను సమీక్షించి తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ కోరింది.
బెంగాల్ , ఒరిస్సా లలో నాలుగు నియోజవకవర్గాలకు ఉప ఎన్నికలకు తేదీ ఖరారు చేసిన ఎన్నికల కమిషన్ తెలంగాణా లోని హుజూరాబాద్ ఉప ఎన్నికల తేదీని నిర్ణయించక పోవడం పట్ల పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్ ప్రకటన తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ డిల్లీలో ఉన్నపుడే ప్రకటించడము పలు అనుమానాలకు దారి తీస్తున్నది తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు డి నిరంజన్ అన్నారు.
గతములో అసెంబ్లీని రద్దుచేసిన కె.సి.ఆర్ మధ్యంతర ఎన్నికలు జరిపే తేదీల విషయములో ఎన్నికల కమీషనర్లతో మాట్లాడానని మీడియా సమావేశంలోనే ప్రకటించిన విశయం గమనార్హం.
విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలు తెరుస్తూ, కరోనా నిబందనలు పాటించకుండా హుజూరాబాద్ లో దళితబంధు సమావేశాలు జరుపుతున్న రాష్త్ర ప్రభుత్వానికి ఎన్నికలనే వరకు కరోనా సాకు చూపడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.
ఎన్నికలు ప్రకటించకున్నా హుజూరాబాద్ లో జరుగుతున్న ప్రచార హోరును ఎన్నికల కమిషన్ గుర్తించటము లేదా? రాష్ఠ్ర ఎన్నికల అధికారి కమిషన్ కు వాస్తవ పరిస్థితులదా నివేదించటము లేదా ? అని నిరంజన్ అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
హుజూరాబాద్ లో ప్రచార ఉదృతిని కట్టడి చేయకుండా ఎన్నికలను ఎంత పొడిగిస్తే కరోనా ముప్పు అంత అధికముగా ఉంటుందని ఎన్నికల కమిషన్ గ్రహిస్తే మంచిది.
వివిధ పథకాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగము చేసి ఎన్నికలలో లబ్ధి పొందే వెసులుబాటు కోసమే టి.ఆర్.ఎస్ ప్రభుత్వము సత్వర ఎన్నికలను అడ్డుకుంటుంది.
ఎన్నికలను వాయిదా వేయడమంటే అధికార దుర్వినియోగానికి అనుమతించటమే.
టి.ఆర్.ఎస్ పార్టీ స్వార్థ లక్ష్యాలకు ఎన్నికల కమిషన్ ఉపయోగ పడ కూడదు.
ఎన్నికల కమిషన్ ఒక ఉన్నత స్ఠాయి అధికారుల బృందాన్ని హుజూరాబాద్ పంపి అక్కడ నెలకొని ఉన్న పరిస్తితులను, జరుగుతున్న అధికార దుర్వినియోగాన్ని అంచనా వేసి సత్వరమే ఎన్నికలు నిర్వయించాలి.