కొంతమంది ఐఎఎస్ ఆఫీసర్లు జీవితాంతం గుట్టుచప్పుడు కాకుండా పనిచేసుకుపోతుంటారు. వాళ్లు తమ పనికే ప్రాముఖ్యం ఇస్తారు. బాధ్యతాయుతంగా ఉంటారు. మరికొందరు ఊరికే హంగామా చేస్తుంటారు.వీళ్లకి రోడ్ల మీద కూడా గౌరవమర్యాదాలు కావాలంటారు. గుర్తింపు ఉండాలనుకుంటారు. తాము చట్టం ముందు దేశ పౌరుల్లో ఒకరిమనే బావన ఉండదు. అబ్బో చాలా ఇగో సమస్య. ఇలాంటిదాన్ని రుజువుచేసే చిన్న సంఘటన ఇపుడొకటి వైరలవుతూ ఉంది.
పోలా భాష్కర్ అనే ఐఎఎస్ ఆఫీసర్ గతంలో ప్రకాశం జిల్లాకు కలెక్టర్ గా ఉన్నారు. అప్పటి దర్పం ఇంకా ఆయన్ని ఇంకా వదల్లేదు. ఇపుడు ఎపి కాలేజ్ ఎజుకేషన్ కమిషనర్. అయినా సరే తాను గతంలో కలెక్టర్ గా పనిచేసినందున అదే గౌరవం చూపాలంటు నిన్న ఒకటోల్ ప్లాజా దగ్గిర టోల్ రుసుం చెల్లింపు దగ్గిర గొడవ పడ్డట్లు మీడియా ప్రముఖంగా ప్రచురించింది. నానా హంగా మా చేశారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఒక సీనియర్ ఐఎఎస్ అధికారి టోల్ రుసుం దగ్గిర ఇలా చేయవచ్చా? టోల్ రుసుం ఎంత ఉంటుంది? నూర్రూపాయల లోపేగా!
ఇంతకి జరిగిందేమిటంటే…
ఆయన మార్కాపురం వెళుతునారు. గుంటూరు-కర్నూలు రోడ్డు మీద అధికారం దర్పంతో దూసుకుపోతున్నారు.వేంగంగా వెళ్తున్నారు. అయితే, మధ్య టోల్ ప్లాజా వచ్చింది. అక్కడ ఎవ్వరికారైనా ఆగాల్సిందే. ఆధమం స్లో చేసుకోవాల్సిందే. నేను ఐఎఎస్,ఐపిఎస్ అంటే కుదరదు. అయితే, త్రిపురాంతకం మండలం మేడపి టోల్ గేట్ వద్ద ఆయన కారు కు స్వాగతం పలుకుతూ బూమ్ బారియర్ పైకి ఎగర్లేదు. కారును ఆపాల్సి వచ్చింది. టోల్ గేట్ సిబ్బంది టోల్ రుసుం అడిగారు. అది ఐఎఎస్ గారికి ఆగ్రహం తెప్పించింది. కార్లో కూర్చున్నది ఎవరనుకున్నావ్, ఐఎఎస్ అధికారి, ఆయనను టోల్ రుసుం అడుగుతావాఅని డ్రైవర్ తన స్థాయిలో తాను దర్పం చూపించారు. అయితే, సిబ్బందికి ఉత్తర్వులు అమలుచేయడమే తెలుసు. ఐఎఎస్ అయితే, ఐడి కార్డు చూపమన్నాడు. దీనితో ఐఎఎస్ కు చిర్రెత్తుకు వచ్చింది. తాను పోలాభాస్కర్ మాజీ కలెక్టర్, కాలేజ్ ఎజుకేషన్ కమిషనర్ నని స్వయంగా సిబ్బందికి సమాధానం చెపుకునే స్థాయికి దిగారు.ఒక నూర్రూపాయలు టోల్ రుసుం పడేసి దర్జాగా వెళ్లిపోవచ్చుగా. అదెలాగూ ప్రభుత్వం నుంచి వసూలు చేసుకుంటారు. నష్టమేంటి?
ఆయన పరువు కాపాడేందుకు లోకల్ తాహశీల్దార్ కుఫోన్ చేయాల్సి వచ్చింది. తాహశీల్లార్ ఏమీ చేయలేక, కేసుపెడతానని సిబ్బందిని బెదిరించి, ఐఎఎస్ ను అక్కడి నుంచి తప్పించాల్సి వచ్చింది.
సమస్యంతా నూర్రూపాయల టోల్ రుసుం కాదు. తాను ఐఎఎస్ నేనే ఇగో.
టోల్ గేట్ దగ్గిర ఇంత రుబాబు చేయడం ఒక ఐఎఎస్ అధికారికి సబబా? అనేది ఇపుడు బాగా చర్చనీయాంశమయింది.