భారతదేశంలో అత్యంత ఎక్కువ భాషా వైవిధ్యం ఉన్న నగరంగా బెంగుళూరు కు గుర్తింపు వచ్చింది. ఒక విశ్లేషణ ప్రకారం బెంగుళూరు నగరంలో 107 భాషలు (షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్) భాషలు మాట్లాడే ప్రజలు జీవిస్తున్నారు.
కన్నడ రాష్ట్రానికి రాజధాని అయినా బెంగుళూరు లో కన్నడం మాట్లాడే వారి సంఖ్య కేవలం 44.62శాతమే. దేశంలో మొత్తంగా 121 షెడ్యూల్డ్ భాషలున్నాయి.
ఇందులో 107 భాషలు బెంగుళూరు మహానగరంలో వినబడతాయంటే భాషాపరంగా అది ఎంత వైవిధ్యమయిన నగరమో వూహించవచ్చు.2011 -2021 మధ్య బెంగుళూరు విపరీతంగా ప్రజలువలస వచ్చారు. అక్కడ భూమి వాడకానికి సంబంధించి నియమాలను సడలించడం, ప్రాథమిక వసతులు మెరుగుపడటంతో దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి ప్రజలు రావడం మొదలయింది. కర్నాటక జనాభాలో 37 శాతంజనాభా బెంగుళూరులోనే ఉంది.
షెడ్యూల్డ్ భాషలకు సంబంధించి కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, కశ్మీరీ, కొంకణి, ఉర్దు, సింధి, సంతాలి, మరాఠి, మణిపురి, నేపాలీ వంటి భాషలున్నాయి. నాన్ షెడ్యూల్డ్ భాషల విషయానికి వస్తే, ఇంగ్లీష్, కాబూలీ, పాస్తో, టిబెటన్, అరబిక్, నిషి, ముందారి, లుషాయి, నికోబరీస్, షెర్పా, నాగాలాండ్ భాషలున్నాయి.
బెంగుళూరు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, సాంస్కృతిక సహనకేంద్రంగా పేరుండటంతో ఈ నగరానికి వచ్చి స్థిరనివాసమేర్పరుచుకునేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారని ఇక్కడి పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కు కెందినఫ్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు.
భాషా వైవిధ్యానికి సంబంధించి పుణే నగరం రెండో స్థానంలో ఉంది. అక్కడ 90 భాషలు మాట్లాడే ప్రజలున్నారు. తర్వాత స్థానాలు ఈశాన్య భారత రాష్ట్రాలవి. అక్కడ ప్రజల్లో సహజ భాషా వైవిధ్యం చాలా ఎక్కువ.
2011 నాటి సెన్సల్ డేటాను విశ్లేషించి భాషా వైవిధ్య నగరాలను గుర్తించారు.