ఎల్లుండి తో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర వంద కిలోమీటర్ల పూర్తి చేసుకుంటుంది. ఆ రోజున వంద మంది నిరుద్యోగులతో కలిసి సంజయ్ పాదయాత్ర చేస్తారు. ఈ విషయాన్ని సంజయ్ సంగ్రామ పాద యాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి వెల్లడించారు.
రేపటి వికారాబాద్ సభ కి మహా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరవుతున్నారు. ఈ నెల 7 న సంగారెడ్డి లో జరిగే సభ కి బిజెవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య హాజరవుతారు. అయితే, వినాయక చవితి సంధర్భంగా ఈ నెల 10 న పాద యాత్ర కి బ్రేక్ ఉంటుంది. ఆ రోజు ఆందోల్ నియోజకవర్గం లోనే సంజయ్ బస చేస్తారు.
ఇక ఏడవ రోజున సంజయ్ కుమార్ యాత్ర చిట్టెంపల్లి నుండి ప్రారంభమయింది. ఆయన వెంబడి మాజీ ఎంపీ వివేక్ కూడా ఉన్నారు.
ప్రజా సంగ్రామ యాత్ర రంగారెడ్డి జిల్లా విజయవంతంగా పూర్తయింది. దీనికి సహకరించిన జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలకు బండి సంజయ్ అభినందనలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా తరపున పార్టీ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డిని ఘనంగా బండి సంజయ్ సత్కరించారు.
రంగారెడ్డి జిల్లాలో 4 రోజులపాటు పాదయాత్ర కొనసాగింది
రంగారెడ్డి జిల్లా స్పూర్తితో వికారాబాద్ జిల్లాతో సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర మరింత దిగ్విజయమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పాదయాత్రలో అనేక ప్రజా సమస్యలు వెలుగులోకి వచ్చాయని, వాటి మీద ఉద్యమించాలని ఆయన జిల్లా నేతలకు పిలుపునిచ్చారు.కార్యకర్తల్లో ఉన్న ఆవేశాన్ని, ఆలోచనను చల్లారనీయొద్దని, 2023 వరకు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.