ఆఫ్గాన్ దేశాధినేతగా ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నియమితుడయ్యే అవకాశాలుకనబడుతున్నాయి. ఆయన పేరును తర్వలోనే ప్రకటిస్తారని తాలిబన్ వర్గాలు చెబుతున్నట్లు హిందూస్తాన్ టైమ్స్ లో ఒక వార్త వచ్చింది.
ఇదే విధంగా గత తాలిబన్ ప్రభుత్వాధినేత ముల్లా ఉమర్ కుమారుడు ముల్లామొహమ్మద్ యాకూబ్ కూడా ప్రభుత్వంలో చేరతారు. షేర్ మొహమ్మద్ స్టానిక్జాయ్ మరొక ఉన్నత స్థానం అక్రమిస్తారని కూడా వార్తలు వెలువడుతున్నాయి.
తిరుగుబాటు చేస్తూ వచ్చిన తాలిబన్ సేనలు ఆగస్గు 15న కాబూల్ ను వశపర్చుకున్నాయి. క్రమంగాఆఫ్గాన్ లో పాంజ్ షిర్ ప్రాంతం తప్ప మిగతా దేశమంతా తాలిబన్ ఆదీనంలో ఉంది. పాంజ్ షిర్ ప్రాంతం మీద పట్టుకోసం తాలిబన్లు, అక్కడి స్థానిక సేనలు పోరాడుతున్నాయి.
ఆఫ్గనిస్తాన్ సహ సంస్థాపకుడయిన బరాదర్ సోవియట్ సేనలకు వ్యతిరేకంగాత పోరాడారు. తర్వాత అమెరికా అక్రమణకువ్యతిరేకంగాపోరాడుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన తాలిబన్ పొలిటికల్ ఆఫీస్ ఛీప్ గా ఉంటున్నారు. ఆఫ్ఘన్ వ్యూహంలో భాగంగా 2010లో సిఐఎ, పాకిస్తాన్ లు బరాదర్ ను కరాచిలో అరెస్టు చేశాయి. ఆయన జైల్లో ఉండేవాడు. అపుడు కర్జాయ్ ప్రభుత్వం ఉండేది. అమెరికా పూర్తిగా తాలిబన్లను రూపుమాపుతామన్న ధీమాతో ఉండేది. అందుకే అధ్యక్షుడు హహీద్ కర్జాయ్ తాము రాజకీయ వప్పందం చేసుకుంటామని బరాదర్ చేసిన ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. ఫలితంగా ఆయన అరెస్టయ్యారు. 2018 నాటికి పరిస్థితి మారిపోయింది. ఆఫ్గన్ తాలిబన్లను అమెరికాఅదుపు చేయలేకపోయింది. ఇక అది సాధ్యం కూడా కాదని భావించి తాన సేనలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. 2018 అక్టోబర్ 25న పాకిస్తాన్ బరాదర్ ను ఖతార్ అభ్యర్థన మేరకు విడుదల చేసింది. ఆయన ఖతార్ వెళ్లిపోయారు. తాలిబన్ పొలిటికల్ ఆఫీస్ ఖతారో లనే ఉండేది. తాలిబన్లతో అమెరికా నేరుగాచర్చలు జరపాలనుకునే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో తాలిబన్లకు తన నిజాయితీ నిరూపించుకునేందుకు అమెరికా బరాదర్ ను విడుదల చేసేందుకు అంగీకరించింది.