ఆదివారం సాయంకాలం పర్యాటకుల కోసం ట్రాఫిక్ బంద్ అయ్యాక హైదరాబాద్ ట్యాంక్ బండ్. ఆదివారం సాయంకాలం హైదరాబాద్ ప్రజలను ట్యాంక్ బండ్ వైపు ఆకర్షించేందుకు మునిసిపల్ మంత్రి కెటి రామారావు సాయంకాలం అయిదు నుంచి రాత్రి తొమ్మిది దాకా టాంక్ బండ్ నుంచి ట్రాఫిక్ దారి మళ్లించాలని నిర్ణయించారు. ఈ ఏర్పాటు ఈ రోజు నుంచే మొదలయింది. దీనితో టాంక్ బండ్ ప్రశాంతంగా తయారయింది. నగర ప్రజలు ట్రాఫిక్ భయం లేకుండా మనశ్శాంతిగా గడిపారు.