విజయవాడ: “కర్ణాటక రాష్ట్రం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు తథ్యం ఆల్మట్టి ఎత్తు 524 మీటర్లకు పెంచుతామని మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా జలాల్లో సగం వాటా మాదేనని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ రాష్ట్ర అధికారులు హంద్రీనీవా కు నీళ్లు ఎందుకు ఇచ్చారు.. వెలుగొండ అ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ లు ఎందుకు ఇచ్చారని ఉత్తరాలు రాస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి నోరు తెరవలేని పరిస్థితుల్లో ఉన్నారు,’’ అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ముఖ్యమంత్రి నీటిపారుదల ప్రాజక్టుల విధానం మీద ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.
“ఈ అసమర్థ, దద్దమ్మ చేతగాని ప్రభుత్వం రాష్ట్ర రైతాంగ హక్కులను తాకట్టు పెడుతున్నది. రాష్ట్ర రైతాంగ హక్కుల గురించి మాట్లాడలేక ముఖ్యమంత్రి మౌనం వహిస్తున్నారు. ఏమైపోయినాయి మీ బిర్యానీ మీటింగులు.. ఏమైపోయాయి ప్రగతి భవన్ లో మీటింగ్ లు,” అని జగన్ కేసీఆర్ ల ఒకనాటి ఆలింగనాలను, విందులను గుర్తు చేస్తూ వ్యాఖ్యానించారు.
ఉమ ఇంకా ఏమన్నారంటే…
*ఏం మాట్లాడుకున్నారు ? ఏం లాలూచీ పడ్డారు ?
*ఎందుకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సగం వాటా మాదేనని మాట్లాడుతున్నాడు?
*మరోపక్క ఆల్మట్టి ఎత్తు పెంచుతామని ఆ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఎందుకు నోరు తెరవడం లేదు ఈ ముఖ్యమంత్రి మంత్రి ఈ మంత్రులు.
*బూతులు మాట్లాడడానికి తప్ప రైతాంగం హక్కుల గురించి మాట్లాడంలో కానీ, ట్రిబ్యునల్స్ ముందు మాట్లాడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
*ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను?