వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఇరిగేషన్ పనులల్లో అధికారులు, కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని పనులు చేయకుండానే MB రికార్డింగ్ చేసుకొని కోట్ల రూపాయలు స్వాహ చేశారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బండి సుధాకర్ గౌడ్ ఆరోపించారు. చివరకు క్వాలిటీ కంట్రోలు అధికారులకూడా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ఆయన ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవినీతికి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
సుధాకర్ వెల్లడించిన అవినీతి వివరాలు
వరంగల్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్ డిబియం 48 సిసి హెచ్ డివిజన్ నెం.4 పరిదిలోని టీగరాజుపల్లి, పర్వతగిరి, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం జిల్లాలోని టీర్ధాల వరుకు అభివృద్ధి పనుల కొరకు 123 కోట్ల రూపాయల వ్యయంతో డిబియం 48,1ఆర్, 2ఎల్, 3ఎల్, 4ఎఆర్, 6ఎల్, 10ఆర్, 10ఆర్ 1, 13ఆర్, 14ఆర్, 16ఆర్, 17ఎల్, 21ఆర్, 24ఆర్, 25ఎల్, 26ఎల్, 27ఎల్, 28ఆర్, 29ఎల్, 30ఆర్, 31ఎల్, 32ఎల్, 34ఆర్, 35ఎల్, 36ఆర్, మరియు 38ఆర్ ఈ ఉప కాలువల అభివృద్ధి కోసం ఎర్త్ వార్క్ బ్లాంకింగ్, సిసిలైనింగ్, ఇన్స్ పెక్షన్ పాత్ పనుల కొరకు నిధులు మంజూరు చేయడం జరిగింది.
1.అయితే, పనులు చేయకుండానే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై దాదాపు 17 కోట్ల రూపాయలు బిల్స్ రికార్డు చేసుకొని డబ్బులు డ్రా చేసుకున్నారు.
2.దీనిని క్వాలిటీ కంట్రోలు అధికారులు ఈ పనులను తనిఖీ చేసినట్లు కనిపించదు. వారంతా కాంట్రాక్టర్ దగ్గర పర్సంటేజీ తీసుకొని క్వాలిటీ సర్టిఫికెట్ ఇచ్చినట్లు భావించాలి. ఇది చాలా దారుణం.
3.దాదాపు 20 కోట్ల రూపాయలతో పర్వతగిరి పెద్ద చేరువులో కూడ నాణ్యత ఏ మాత్రం పట్టించుకోకుండా అరకొర పనులు చేయడం జరిగింది.
4.ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడ పనిచేస్తున్న ఒక AE విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు చేశాము. అయితే, దీని మీద తూతూ మంత్రంగా విచరణ చేసి, విచారణ అధికారి అయిన విజిలెన్స్ శాఖ AE శ్రీనివాస్ సదరు కాంట్రాక్టర్ల దగ్గర 50 లక్షల రూపాయలు లంచం తీసుకోని కాంట్రాక్టర్లకు వత్తాసు పలికారు. ఇది శోచనీయం.
5.వరంగల్ జిల్లాలోని డిబియం 38 ప్యాకీజీ పనులు గీసుగొండ మల్లంపల్లి, పరకాల వరకు 123 కోట్ల అంచనా వ్యయంతో డొవెల్ బ్యాంకింగ్ సిసి లైనింగ్, ఇన్స్ పెక్షన్ పాత్ అభివృద్ధికోరకు నిధులు మంజూరు చేయడం జరిగింది.
6.డిబియం 48, డిబియం 38లలోని పనులను కాంట్రాక్టర్లు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, స్వర్ణ ఎలక్ట్రికల్స్ మరియు కాంట్రాక్టర్స్ అధినేత సురేష్ రావు, సమరావులు పనులను దక్కించుకున్నారు నాణ్యతా లోపంతో, కొంత పనిచేయకుండానే బిల్స్ రికార్డు చేసుకోని ప్రజాధనాన్ని అప్పనంగా కొట్టేశారు. . ఇందులో రు. 246 కోట్ల రూపాయల పనుల్లో దాదాపు 100కోట్ల రూపాయలను అధికారులు, అధికారపార్టీ నాయకులతో కుమ్మక్కైకాజేశారు.
వీరి అవినీతిని ప్రశ్నించిన ఒక ఎఈని తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఖమ్మంకు ట్రాన్స్ ఫర్ చేయించారని ఆయన పేర్కొన్నారు,, అంతే కాకుండా ప్రస్తుత EE వెంకటేశ్వర్లుని కాపాడేందుకు ఒక సంవత్సర కాలంలో దాదాపు నలుగురై దుగురు EE లను ట్రాన్స్ఫర్ చేయించారంటే ఎంత పకడ్బందీగా అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థమవుతుందని ఆయనఆశ్చర్యం వ్యక్తం చేశారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఇరిగేషన్ పనులైన డిబియం 48, డిబియం 38లలో జరిగిన పనుల పై సమగ్ర విచారణ జరిపించాలనని సుధాకర్ గౌడ్ కోరారు.
100కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్య తీసుకోవాలని ఆ కాంట్రాక్టర్ల నుండి రెవెన్యూ రికవరీ యాక్టుక్రింద అక్రమంగా డ్రా చేసిన డబ్బులను వసులు చేయాని, అక్రమాలకు పాల్పడిన ఆ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన డిమండ్ చేశారు.
విజిలెన్స్ శాఖ నుంచి విచారణ అధికారిగా వచ్చిన DE శ్రీనివాసను సస్పెండ్ చేయాలని కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు