ప్రముఖ జర్నలిస్టు ముళ్లపూడి సదాశివశర్మ మరణించారు. ఈ ఉదయం హైదరాబాద్ లో గుండె జబ్బుతో ఆయన మరణించినట్లు సమాచారం అందింది. శర్మ హిందీ మిలాప్, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి పత్రికలకు ఎడిటర్ గా పనిచేశారు. తెలుగు హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవాడు. అందుకే రెండు సార్లు హైదరాబాద్ నుంచి వెలువడే హిందీ మిలాప్ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు.గత రాత్రి ఆయన ఉన్నట్లుండి అసౌకర్యానికి గురికావడంతో మొదట కామినేని ఆసుపత్రికి చేర్చారు. తర్వాత నేరెడ్మెట్ లోని మరొక ఆసుపత్రికి తరలించారు.అక్కడే మృతిచెందారని తెలిసింది. వీరికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.
దాదాపు 4 దశాబ్దాల పాటు జర్నలిజం వృత్తి లోనే కొనసాగారు. తొలుత ఆంధ్ర ప్రభలో విలేకరిగా, ఉప సంపాదకులు గా అనిచేసి, తర్వాత హిందీ మిలాప్ దినపత్రిక లో సుదీర్ఘకాలం సపాదకునిగా భాద్యతలు నిర్వహించారు. కొద్ది స్వల్పకాలం ఈనాడు లో పనిచేశారు. ఆంధ్ర ప్రభ యాజమాన్యం మారిన తర్వాత కొంతకాలం సంపాదక భాద్యతలు కూడా నిర్వహించారు. చివరిగా ఆంధ్ర భూమిలో శ్ఎమ్.వి.ఆర్.శాస్త్రి తర్వాత ఏడాది పాటు సంపాదక భాద్యతలు కూడా నిర్వహించారు. వీరి స్వస్థలం తెలంగాణా రాష్ట్రంలోని వికారాబాద్.
పలువురు మిత్రులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
అల్లం నారాయణ నివాళి
సీనియర్ పత్రికా సంపాదకులు, బహుభాషా కోవిదుడు, హిందీ, తెలుగు భాషలో నిష్ణాతుడు సదాశివ శర్మ అని అల్లం నారాయణ, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్ అన్నారు. శర్మ మృతికి సంతాపం తెలిపారు.
“ఆంధ్ర ప్రభ, ఆంధ్రభూమి, హిందీ మిలాప్ పత్రికలకు ఆయన సంపాదకుడిగా సేవలందించారు.సదాశివ శర్మ ఉత్తమ జర్నలిస్టుగా పేరొందారు.ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి,” అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.