2020 మార్చి తర్వాత మొదటి సారి బాగా తగ్గిన కోవిడ్ కేసులు

దేశవ్యాపితంగా కోవిడ్ పరిస్థితి, కరోనా వ్యాప్తి బాగా అదుపులో ఉంది. మొట్టమొదటి సారి కరోనా కేసులు బాాగా తగ్గిపోయాయి..

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,658 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 496 మంది మృతి.

గత 28 రోజులుగా పాజిటివిటి రేటు 3 శాతంలోపే కొనసాగుతున్నది.ఇపుడు 2.10 శాతమే ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు  1.6 శాతం మాత్రమే. 2020 మార్చి నుంచి ఇంతతక్కువ స్థాయికి కోవిడ్ కేసులు పడిపోవడం ఇదే మొదటిసారి. జాతీయ స్థాయిలో కోవిడ్ రికవరీ రేట్  97.60 శాతం ఉంది. మరొక వైపు  వ్యాక్సినేషన్  61కోట్లు దాటింది.  గురువారం నాటికి 61,10,43,573 డోసుల వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.  ఇందులో  47,19,00,520  మందికి మొదటి డోసులు  అందాయి.  13, 91,43,053 మందికి రెండు డోసులు అందాయి.

గురువారం నాడు  68 లక్షల డోసుల వ్యాక్సి న్ వేశారు.  ఇందులో  46 లక్షల మందికి మొదటి డోసు,  20లక్షల మందికి రెండో డోసు ఇచ్చారు.

నిన్న ఒక్కరోజే కోలుకున్న 32,988 మంది బాధితులు.

దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య
3,26,03,188 కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.

ప్రస్తుతం 3,44,899 మందికి కొనసాగుతున్న చికిత్స.

కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 3,18,21,428 మంది బాధితులు.

కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 4,36,861 మంది మృతి.

దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.60% మరణాల రేటు 1.34%.

ఇప్పటివరకు 61,22,08,542 మందికి కరోనా టీకాలు.

ఒక్క కేరళ రాష్ట్రంలో నిన్న 30,007 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *