తిరుమలలో శ్రీవారి భక్తుల కొరకు సాంప్రదాయ భోజనం ప్రయోగత్మకంగా అన్నమయ్య భవనంలో గురువారం ఉదయం ప్రారంభించారు.
టీటీడీ ఇప్పటికే గోవిందదునికి గో ఆధారిత నైవేద్యం అందించడంలో భాగంగా దేశీయ గోవుల ఉత్పత్తులతో చేసిన వ్యవసాయం ద్వారా పండించిన బియ్యం, పప్పు దినుసులు, బెల్లం, నెయ్యితో శ్రీవారికి అన్న ప్రసాదాల నైవేద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా దేశీయ వ్యవసాయంతో పండించిన బియ్యం, పప్పు దినుసులతో తయారు చేసిన అల్ఫాహరం, భోజనం ఎలాంటి ఆదాయం లేకుండా కాస్టు టు కాస్టుతో టిటిడి భక్తులకు అందించాలని సంకల్పించింది.
సాంప్రదాయ భోజనంపై భక్తుల అభిప్రాయాలు, సూచనలు తీసుకుని సెప్టెంబర్ 8వ తేదీ వరకు టిటిడి ప్రయోగత్మకంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా దేశీయ వ్యవసాయ పరిశోధకులు శ్రీ విజయరామ్ మాట్లాడుతూ మన పూర్వీకులు మనకు అందించిన గో ఆధారిత వ్యవసాయంతో పండించిన దేశీయ బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలను టిటిడి కోనుగోలు చేయడం అభినందనీయమన్నారు. దీనిద్వారా దేశీయ విత్తనాలు, దేశీయ గో జాతులను గ్రామల్లోకి పునః ప్రవేశపెట్టవచ్చన్నారు.
అనంతరం చిరుధాన్యాల ఆహర నిపుణులు శ్రీ రాంబాబు మాట్లాడుతూ దేశీయ ఆవునెయ్యి, బెల్లం, గానుగ నూనెతో వంటలు వండి భక్తులకు వడ్డిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం కుల్లకారు బియ్యంతో ఇడ్డీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మ తయారు చేసి అందించినట్లు తెలిపారు. ఇందులో శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు, అనేక వ్యాధులను ఎదుర్కొనే వ్యాధి నిరోదక శక్తి ఉంటుందన్నారు. మధ్యాహ్నం కొబ్బరి అన్నం, పులిహోర, పూర్ణలు, వర్ష రుతువులో తీసుకోవసిన అహారమైన పచ్చి పులుసు, దోశకాయ పప్పు తదితర 14 రకాల వంటకాలు చెఫ్ శ్రీ గోపి వండి భక్తులకు అందించినట్లు వివరించారు.
భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన మన ఆరోగ్యంతో పాటు రైతు సంక్షేమం, గో సంక్షేమం,దేశం కూడా ఆర్థికాభివృద్ధి చెందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు రమేష్‌బాబు, హరీంద్రనాథ్, లోకనాథం, భాస్కర్, ఇఇ జగన్మోహన్ రెడ్డి,
మాజీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.