సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 9 మంది న్యాయమూర్తుల పేర్లకు కేంద్రం ఆమోదం లభించింది. ఈ జాబితాను రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. రాష్ట్ర పతి ఆమోదముద్ర పడగానే వారిని సుప్రీంకోర్టున్యాయమూర్తులుగా నియమిస్తారు. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులుండాలి. ఇపుడు పది ఖాళీలున్నాయి. వీటిలో 9 ఇపుడు భర్తీ అవుతాయి.
గత వారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని కొలీజియర్ 9 పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. అందులో ముగ్గురు మహిళలున్నారు.వారు, జస్టిస్ బివి నాగరత్న (కర్నాటక హైకోర్టు), జస్టిస్ హీమా కోహ్లీ(తెలంగాణ), జస్టిస్ బేలా ఎం త్రివేవి (గుజరాత్ ) ఉన్నారు. వీరిలో జస్టిస్ నాగరత్న 2017 సెప్టెంబర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన ఘనత ఆమెకు దక్కుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రిటైర్ మెంట్ వయసు 65 సంవత్సరాలు.
జస్టిస్ నాగరత్న ఎవరు?
ఆమె ఎవరో కాదు, గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఇఎస్ వెంకట్రామయ్య కూతురు. ఆయన 1989లో కొన్ని నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
జస్టిస్ ఎస్ ఎ బాబ్డే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నపుడు కూడా జస్టిస్ నాగరత్నను సుప్రీంకోర్టు కు నియమించే ప్రతిపాదన చర్చకు వచ్చింది. అపుడు సుప్రీంకోర్టులో కర్నాటక నుంచి ముగ్గురు న్యాయమూర్తులున్నందున ఇతర హైకోర్టులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఉన్నందున ఆమెకు సుప్రీంకోర్టు అవకాశం దక్కలేదని కొందరు చెబుతారు.
మొదటి సారి ఘనత కుటుంబం జస్టిస్ వైవీ చంద్ర చూడ్ కుటుంబానిది. 1978 ఫిబ్రవరి నుంచి జులై 1985 వరకు, ఏడు సంవత్సరాలు, చీఫ్ జస్టిస్ గా ఉన్న వైవీ చంద్ర చూడ్ కుమారుడు జస్టిస్ డి వై చంద్ర చూడ్ నవంబర్ 2022 న చీఫ్ జస్టిస్ అవుతున్నారు. జస్టిస్ రమణ రిటైర్ కాగానే చంద్ర చూడ్ బాధ్యతలు స్వీకరిస్తారు.