నేటి నుంచి ఎపిలో న్యూమోనియా వ్యాక్సినేషన్

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి  న్యూమోనియా టీకా (pneumococcal conjugate vaccine ) అందుబాటులోకి వస్తున్నది.

ఈ టీకా లను ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తున్నారు.

న్యూమోనియా వ్యాధితో ఏటా దేశంలో 16 శాతం మంది రెండేళ్ల లోపు చిన్నారుల మృతి చెందుతున్నారు. న్యూమోనియా  2 సంవత్సరాల లోపు పిల్లకువస్తుంటుంది. దన్యూమోనియా వ్యాధి బారిన పడకుండా న్యూమో కోకల్ టీకా  వేయాల్సి ఉంటుంది. ఎపిలో రెండేళ్లలోపు 8.40 లక్షల మంది చిన్నారులకి ఏటా వేయనున్న న్యూమోనియా టీకా వేస్తారు. ఈ టీకాను ఇళ్ల దగ్గరకు వచ్చే వేస్తారు.లేదా గ్రామ వైద్య కేంద్రాలలో కూడా వేస్తారు.

ఈ ఏడాది 5 లక్షల మందికి పైగా చిన్నారులకి వ్యాక్సిన్ వేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రతీ చిన్నారికి మూడు డోసుల వ్యాక్సినేషన్ ఉంటుంది..మొదటి సారి ఆరు వారాల సమయంలో టీకా, రెండవ డోసు 14 వారాలు, మూడవ డోసు తొమ్మిది నెలల తర్వాత ఇస్తారని అధికారులు చెప్పారు.

ఆరు వారాలు నిండిన 5,45,506 మంది చిన్నారులకి ఈ ఏడాది న్యూమోనియా తొలి డోసు వేయనున్నట్లు వారు తెలిపారు.

14 వారాలు నిండిన 4,09,130 మంది చిన్నారులకి ఈ ఏడాదిలో రెండవ డోసు ఇస్తున్నారు.

ఈ ఏడాదిలో తొమ్మిది నెలల నిండిన 68188 మంది చిన్నారులకి బూస్టర్ డోసు ఇస్తారు.

ప్రతీ బుధవారం, శనివారం చిన్నారులకి ఈ న్యూమోనియా టీకా వేస్తారు.

ఈ నెల కోటాగా  86 వేల డోసులు రాష్ట్రానికి అందాయని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *