మూడుచింతలపల్లి నుంచే తాను దళిత గిరిజన ఆత్మ గౌరవ దీక్ష మొదలు పెట్టేందుకు కారణం ఏమిటో పీసీసీ ఛీఫ్ రేవంత్ శిబిరంలో వివరించారు.
వివరంగా…
రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు..
కేసీఆర్ దత్తత తీసుకొని మూడు గ్రామాలను ఎలా దగా చేసిండో చూపేందుకే ఇక్కడ దీక్ష చేసినా..
నాలుగేళ్ల కిందట ఇక్కడ కేసీఆర్ మీటింగ్ పెట్టి పశువుల దవాఖాన కడుతా అన్నాడు.. వీరారెడ్డి కట్టిన దవాఖాన శిథిలావస్థలో ఉంది అని చెప్పిండు..
రోడ్లు వేస్టా అన్నాడు. రైతులకు విద్యుత్ సమస్య లేకుండా చేస్తా ఆనాడు.
దళితులకు కమ్యూనిటీ హాల్ కడతా అన్నాడు..
మూడు చింతల పల్లి, కేశవరం గురించి చెప్పిన అనేక పనులు చేస్తా అన్నాడు.
డబుల్ బెడ్ రూమ్ కడుతా అన్నాడు, దళితులకు భూమి ఇస్తా అన్నాడు.
నేను ఇక్కడ రెండు రోజుల నుంచి దీక్ష చేస్తున్న..
గ్రామంలో రచ్చబండ పెడ్త రండి అభివృద్ధి గురించి చర్చిద్దాం అన్నా..
దళితులకు భూములు ఇచ్చినా డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చినా రైతులకు రుణ మాఫీ చేసినా గ్రామంలో అభివృద్ధి చేసినా ఎంపీ పదవికి రాజీనామా చేసి గుండు కొట్టించుకొని పోతా..
ఈ విషయాలపై చర్చలకు రాలేదు. పాల మల్లారెడీ కూడా చర్చ రాలేదు.
మంత్రి మల్లారెడ్డి భూములు అక్రమంగా భూములు కబ్జా చేసుకొని తన కొడలి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆసుపత్రి కట్టుకున్నాడు.
మల్లారెడ్డి యూనివర్సిటీ కి కేటాయించిన భూమి మల్లారెడ్డి ది కాదు..
మల్లారెడ్డి మెడికల్ కాలేజి, ఇంజినీరింగ్ కాలేజి మీద, ఆసుపత్రి మీద యూనివర్సిటీ మీద నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నా..
సీఎం, మల్లారెడ్డి అవినీతి పై విచారణకు అదేశించాలి. నేను అవినీతి నిరూపించక పోతే సీఎం వేసే ఎలాంటి శిక్ష కైనా తాను సిద్ధం..
తెలంగాణ యువకులు ఎంతో మంది బలిదానాలు చేసుకుంటే వచ్చినా తెలంగాణ లో కేసీఆర్ కుటుంబం, మల్లారెడ్డి కుటుంబం దోచుకుంటున్నారు.
తాను రాత్రి ఇందిరమ్మ ఇంట్లో.దళిత వాడలో పడుకున్నా. చెన్నారెడ్డి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల ఇచ్చింది.
ఇప్పుడు కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు పోవడానికి రోడ్ వేసుకున్నాడు.
ఇప్పుడు రోడ్ పైకి అయ్యింది. ఇళ్లు కిందికి అయ్యింది వర్షం పడితే మా ఇళ్లకు నీళ్లు వస్తున్నాయి. వర్షం పడితే మోరీ నీళ్లు వచ్చి నిద్ర లేకుండా అవుతున్నాయి.
ఊరిలో కాంగ్రెస్ ప్రభుత్వం.ఇచ్చిన భూములకు పాస్ బుక్ లు ఇవ్వకుండా మా భూములు గుంజుకోవడానికి కుట్ర చేస్తున్నారని బాగయ్య చెప్పిండు.
నేరుగా ప్రభుత్వమే ఇలా పేదల భూములు గుంజుకుంటే ఎలా..
తెలంగాణ ఉద్యమం కారుడు మాజీ సమితి అధ్యక్షులు వీరారెడ్డి పేరును కూడా వాడుకొని కేసీఆర్ ప్రజలను మోసం చేసిండు.
*కేసీఆర్, మోసం రెండు ఒక్కటే.. ఏది ముందు పుట్టిందంటే చెప్పడం కష్టం..*
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మా కష్టాలు తీరుతాయి..
*ప్రజల కష్టాలు తీరాలంటే మూడు చింతలపల్లి ప్రజలు కేసీఆర్ ను టిఆర్ఎస్ నాయకులను చీరి చింతకు కట్టాలె*
తెలంగాణ ప్రజల పోరాటాన్ని ప్రజల త్యాగాలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది.
తెలంగాణ కోసం కేసీఆర్ ఏదో కొంత కష్టపడితే ఆయనకు ఇప్పటికే కేసీఆర్ రెండు సార్లు ముజ్యమంత్రి అయ్యిండు..
ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు,ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్యెల్సి పదవులు ఇచ్చాము..
ఇన్ని ఇచ్చిన ప్రజలకు కేసీఆర్ కుటుంబం ఏమి ఇచ్చింది.
రోడ్ మీద ఉండే మేఘ కృష్ణ రెడ్డి ఇప్పుడు ప్రపంచంలో ధనవంతుడు అయ్యిండు.
రామేశ్వరరావ్ కోసమా, మేఘ కృష్ణ రెడ్డి కోసమో తెలంగాణ ఇవ్వలేదు.
దళిత బంధు తెలంగాణ లో దళితులకు అందరికి ఇవ్వాలన్న డిమాండతో ఉద్యమం చేస్తున్నాం
మెదటి అడుగు ఉద్యమాల గడ్డ ఇంద్రవెళ్లిలో అడుగు పెట్టాం.. రెండో అడుగు రావిర్యాల లో పెట్టాం.. మూడో అడుగు కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కన మూడు.చింతల పల్లి లో పెట్టాం..
కేసీఆర్ 45 రోజుల నుంచి ఫామ్ హౌస్ బయటకు వచ్చి తిరుగుతున్నాడు. ఇంతకుముందు ఇలా తిరిగాడా…
జపాన్ ఎలుక లెక్కన కేసీఆర్ ప్రమాదాన్ని పసిగట్టిండు..
అందుకే జనం లా తిరుగుతున్నాడు.
ఇప్పుడు బీసీ బంధు, మైనారిటీ బంధు బ్రాహ్మలకు బంధు ఇస్తామంతున్నాడు.
కానీ కేసీఆర్ కాలం అయిపోయింది. కేసీఆర్ ఇప్పటికే తెలంగాణ ను దోచుకున్నాడు. ఆయన దోచుకున్నదంతా కక్కిస్తాం..
అంగీ లాగు లేకుండా మొత్తం గుంజుకొని ఆయనకు బజార్లో నిలబెడతాం….
కేసీఆర్ తెలంగాణ కు ఏమి చెయ్యలేదు. ఇచ్చిన హామీలు దళితులకు భూములు, డబులు బెడ్ రూమ్ ఇచ్చిందా..
*ప్రగతి భవన్ డా. బాబాసాహెబ్ బహుజన భవన్ గా మారుస్తాం.*.
అక్కడి నుంచి దళిత, గిరిజన, బహుజన విద్యార్థులను ఐఏఎస్ లు గా, ఐపీఎస్ లుగా మారుస్తా..
దళిత, గిరిజనులు బాగా చదుకోవాలి వాళ్ళు దేశానికి ఆదర్శం కావాలి.
దళితులకు మంచి విద్యను అందించి వాళ్ళు చేపలు పట్టుకునేలా చేయాలి.
దళిత, గిరిజనులు చట్టాలు తయారు చేయాలి.
దామన్న చదువుకున్నాడు కాబట్టి ఆయన ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ చేసిండు.
దళిత, గిరిజనులు బాగా చదువుకోవాలి. రాజ్యధికారం సాధించాలి.
పెన్షన్లు ఇవ్వడం అభివృద్ధి కాదు. భూములు, ఇల్లు ఇస్తే మనం అభువృద్ది చెందినట్టు కాదు.
మనం చదుకోవాలి. మనం విద్యావంతులు అయితే మనం.ప్రపంచాన్ని ఏలవచ్చు..
*కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దళిత, ఆదివాసీల విద్య కోసం ఎక్కువ బడ్జెట్ పెట్టేలా చేస్తా..*
*ఎవరు సీఎం అయినా కోట్లాడి మొదటి సంతకం విద్య కోసం ఎక్కువ బడ్జెట్ పెట్టిస్తా..*
*దేశంలో విద్యావంతులను ఎగుమతి చేసే రాష్టంగా తెలంగాణ ను తీర్చిదిద్దుతా..