పట్టాదారు పేషంట్ కావడం వలన అంబులెన్స్ లొనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తహశీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే.
చెన్నూరు మండలం పొన్నారం గ్రామానికి చెందిన చెకుర్తి రాజగోపాల రెడ్డి చెన్నూరు మండలంలోని పొన్నారం శివారులోని తన పేరుమీద ఉన్న భూమిని తన ఇద్దరు కుమారులకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించడానికి బుధవారం చెన్నూరు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చినారు.
కానీ అతను గత పదిహేను సంవత్సరాల నుండి వెన్నుపూస నొప్పి కారణముగా మంచానికి పరిమితమయ్యారు.
బుధవారం వారి కుమారులు సదరు పట్టేదారు ను అంబులెన్స్ లో చెన్నూరు తహశీల్దార్ కార్యాలయానికి తీసుకు వచ్చారు. వెంటనే విషయం తీసుకున్న చెన్నూరు తహశీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే పట్టేదారు పరిస్థితి గమనించి తన ధరణి ఆపరేటర్ వినోద్ తో కలిసి తన లాప్ టాప్ తో అంబులెన్స్ వద్దకే వెళ్లి ఆ పట్టేదారు వేలిముద్రలు, ఫోటో తీసుకొని అంబులెన్స్ లొనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. ఈ రిజిస్ట్రేషన్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.