ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన కేసు సెప్టెంబర్ 15 కు వాయిదా పడింది. ఆయన మీద చాలా కేసులు ఉన్నందున, ఆయన ముఖ్యమంత్రి హోదాలో సాక్షులను ప్రభావితం చేసే వీలుందని ఆయన బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో వేసిన పిటిషన్ మీద వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ ని వైసిసి రెబెల్ ఎంపి కనుమూరి రఘురామ కృష్ణరాజు వేశారు. కోర్టు తీర్పు వెలువడటమే మిగిలింది. ఆయన తో పాటు వైసిపి రాజ్యసభ సభ్యుడు జగన్ సహ ముద్దాయి అయిన విజయ సాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని కోర్టు లో మరొక పిటిషన్ వేశారు.
జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణను సెప్టెంబర్ 15కు కోర్టు వాయిదా వేసింది.
అపుడు కోర్టు తీర్పు వెలువరిస్తుందని అనుకుంటున్నారు. మొత్తానికి ఇప్పటి నుంచి కోర్టు తీర్పు వెలువడే దాకా వైసిపిలో ఒకటే ఉత్కంఠ
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మీద 28 కేసులున్నాయి. అందులో 6 కేసులను ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇటీవల ప్రభుత్వాలు హైకోర్టు అనుమతి లేకుండా కేసులను ఉపసంహరించు కోకూడదని తీర్పుచెప్పింది.
అసలు జగన్ కేసులన్నీ కోర్టు సూచనల మేరకే సిబిఐ విచారణకు వెళ్ళాయి. అపుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ శంకర్ రావు హైకోర్టులో వేసిన పిటిషన్ వల్ల ఆయన అక్రమార్జనల ఆరోపణల మీద సిబిఐ విచారణ మొదలయింది. ఫలితంగా జగన్ ఏడాదిన్నర జైలులో ఉన్నారు. ఆపైన బెయిలు మీద విడుదలయయ్యారు. ఈ బెయిల్ ను రద్దు చేయాలనే దాని మీద సిబిఐ కోర్టు తీర్పు చెప్పనుంది.
సెప్టెంబర్ 15, జగన్ , విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు రెండింటిపైన కోర్టు తీర్పు చెబుతుంది.