బ్రేకింగ్ …
అనంతపురం జిల్లాలో విషాదం
శింగనమల మండలంలోని శ్రీ గంపమల్లయ్య స్వామి దేవాలయ సమీపంలో అపశృతి. శింగనమల సమీపంలోని చిన్న జలాల వద్ద ఉన్న కొండల్లో గంప మల్లయ్య కొండ ఒకటి. అక్కడి దేవుడిని గంపమల్లయ్య స్వామి అని పిలుస్తారు. ఈ కొండ పక్కనే లోతైనలోయ ఉంటుంది. ఈ కొండమీది గుహలో ఉండే ఈ స్వామికి జరిగే గంపమలయ్య జాతర ఈ ప్రాంతంలో బాగా పేరున్న ఉత్సవం.
శ్రావణ మాసంలోని శనివారాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగానే నేడు కూడా ఈ ఉత్సవం జరిగింది. ఇక్కడి పూజారి పేరు అప్పా పాపయ్య. సాధారణంగా భక్తులు గోవింద నినాదాల మధ్య పూజారి గుహలోకి దిగి అక్కడ పూజ నిర్వహించాలి.
నిన్న ఇలాంటి ప్రయత్నం చేస్తుండగా పూజారి కాలుజారింది. అంతే, ఆయన దొర్లుకుంటుూ సుమారు 300అడుగల లోయలో పడి చనిపోయారు. ఆయన వేగంగా బండల మీద పడిపోవడంతో కాపాడేందుకు కూడా ఎవరికి అవకాశం దొరకలేదు.
కొండ అంచున నిలబడి హరతిపట్టి గుహలోకి దిగాలనుకోవడం చాలా ప్రమాదకరం. అయినా ఈ పూజలను ఇదే పద్ధతిలో నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో పాపయ్య తండ్రి కూడా ఇలాగే కాలు జారి చనిపోయాడని స్థానికులు చెబుతున్నారు.