ఆంధ్రాలో నేడు,రేపు భారీ వర్ష సూచన

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ లో నేడు, రేపు, వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్యభారత దేశం వైపు ప్రయాణించింది.

*అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి.

*ఈ కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది రేపటికి మరింత బలపడనుంది.

*దీని ఫలితంగా ఈ నెల 21, 22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో రాగల 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *