అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో మొత్తం 6,800
మంది పిల్లలు కన్నవారిని కోల్పోయినట్టు రాష్ట్ర
ప్రభుత్వం గుర్తించింది. వారిలో కొందరు తల్లి
దండ్రులిద్దరినీ కోల్పోగ మరికొందరు తల్లి
లేదా తండ్రిని కోల్పోయారని తెలిపింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇలాంటి
చిన్నారుల చదువులు మధ్యలో ఆగకుండా
చర్యలు తీసుకునేందుకు సంకల్పించినట్టు
పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు వాడ్రేవు
చినవీరభద్రుడు తెలిపారు.
మహిళాసంక్షేమం, శిశు అభివృద్ధి శాఖ సేకరించిన వివ
రాల ప్రకారం.. కరోనా వల్ల తల్లిదండ్రులిద్దరినీ
లేదా ఒకరిని పోగొట్టుకున్న వారి సంఖ్య
6,800 అని తేలింది. వీరిలో 1,659 మంది
ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో… 2,150
మంది ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్నా
రని తేలింది.
మిగిలిన 524 మంది శిశువులని
గుర్తించారు. వారి శ్రేయస్సు దృష్యా తీసుకోవలసిన చర్యలపై హైకోర్టు సారథ్యంలోని జువెనైల్ జస్టిస్ కమిటీ ఇటీవల పాఠశాల విద్య,
స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారులతో సమీక్ష నిర్వ
హించింది. అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ
శాల యజమానులకు ఆదేశాలు జారీచేసింది.
ఆ విద్యార్థులను అదే పాఠశాలల్లో తప్పనిస
రిగా కొనసాగించాలని తెలిపింది. ఫీజులు
చెల్లించలేదన్న కారణంతో సదరు విద్యార్థు
లను తొలగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని
హెచ్చరించింది. వారికి జగనన్న విద్యా కానుక
కింద అందించే ప్రయోజనాలన్నీ అందేలా
చూడాలని తెలిపింది.
విద్యార్థులకు అవసర
మైన యూనిఫాం, పాఠ్యపుస్తకాలకు ఎంత
ఖర్చవుతుందో విద్యాశాఖకు తెలిపితే
ఖర్చును తామే భరిస్తామని పేర్కొంది.