ప్రజా పక్ష కార్యకర్త, తెలంగాణ విద్యావంతుల వేదిక స్నేహితురాలు, డాక్టర్ తడక యాదగిరి సహచరి కల్పనా పద్మశాలి గురువారం తెల్లవారుజామున లివర్ కాన్సర్ తో హైదరాబాద్ లో మరణించారు.
కల్పన గత 15 ఏళ్లుగా వివిధ సామాజిక, రాజకీయ ఉద్యమాలలో భాగస్వామి.
చేనేత కుటుంబం నుండీ వచ్చిన కల్పన చివరి వరకూ అట్టడుగు వర్గాల సంక్షేమం కోసమే పని చేశారు.
మరపురాని చిరునవ్వు,స్నేహం తన సొంతం.
రైతు స్వరాజ్య వేదిక ఏర్పడినప్పటి నుంచి తాను క్రియాశీల మద్దతుదారు. మహిళల,రైతుల,ఆదివాసీల,చేనేత కార్మికుల హక్కుల కోసం ధృడంగా నిలబడి ప్రజల సమస్యల విషయంలో ప్రజా సంఘాలతో కలసి నడవడానికి ఎప్పుడూ ముందుండేది.
కల్పన మరణం శ్రామిక ప్రజలకు పెద్ద నష్టం.. కల్పనకు జోహార్లు.. కల్పన కుటుంబ సభ్యులకు మా సంతాపాన్ని,సానుభూతిని తెలియ చేస్తున్నాం.. 💐జోహార్లు కల్పన గారికి
—-తెలంగాణ విద్యావంతుల వేదిక