తొలి మహిళా చీఫ్ జస్టిస్ కానున్న నాగరత్న, ఇంతకు జస్టిస్ నాాగరత్న ఎవరు?

స్వాతంత్య్రం వచ్చి 75 యేళ్లుఅవుతున్నా మహిళలనాయకత్వంలోకి రాని రంగాలెన్నో ఉన్నాయి. అందులో సుప్రీంకోర్టు ఒకటి.  ఇంతవరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఇంకా మహిళలకు దక్కలేదు. ఇపుడు తొలిసారి  ఈ అవకాశం కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి. నాగరత్నంకు దక్కనుంది. దేశంలోని న్యాయమూర్తులలో ప్రస్తుతం  11 మహిళల వాట కేవలం 11 శాతమే. ఇపుడు దేశంలో ఉన్న 25 హైకోర్టులలో ఒకే ఒక్క మహిళా న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అది తెలంగాణ హైకోర్టులో. అక్కడ జస్టిస్ హిమా కోహ్లీ ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టులో మహిళ న్యాయమూర్తుల సంఖ్య బాగా తక్కువా ఉండటం పల్ల చాలా రోజులు అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. మొన్నీ మధ్య   సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం ఈ విషయం ప్రత్యేకంగాప్రస్తావించింది. అసలు సుప్రీంకోర్టు చరిత్రలో ఇంతవరకు కేవలం ఏనిమిది మందంటే ఎనిమిది మహిళలు న్యాయమూర్తులయ్యారు.పట్నా, మణి పూర్, మేఘాలయ, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్టులలో అసలు మహిళన్యాయమూర్తులే లేరు.

ఈ నేపథ్యంలో జస్టిస్ నాగరత్న ను  సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా  నియమించాలన్న సిఫార్సు కేంద్రానికి వెళ్లిందని వార్తలు వస్తున్నాయి.

సుప్రీంకోర్టు కొలిజియం కేంద్రానికి ఆమోదానికి పంపిన 9 పేర్లలో జస్టిస్ నాగరత్న ఒకరు. జస్టిస్ నాగరత్న 2008 ఫిబ్రవరి 18న  కర్నాటక హైకోర్టు  న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 ఫిబ్రవరి 17న పర్మనెంట్ జడ్జి అయ్యారు. ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయితే, 2027 ఫిబ్రవరిలో జస్టిస్ సూర్య కాంత్ అనంతరం ప్రధాన న్యాయమూర్తి అవుతారు. అక్టోబర్  29, 2027 దాకా ఆమె ఆపదవిలో కొనసాగుతారు.

ఆమె ఎవరో కాదు, గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఇఎస్ వెంకట్రామయ్య కూతురు. ఆయన 1989లో కొన్ని నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

జస్టిస్ ఎస్ ఎ బాబ్డే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నపుడు కూడా జస్టిస్ నాగరత్నను సుప్రీంకోర్టు కు నియమించే ప్రతిపాదన చర్చకు వచ్చింది. అపుడు  సుప్రీంకోర్టులో కర్నాటక నుంచి ముగ్గురు న్యాయమూర్తులున్నందున ఇతర హైకోర్టులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఉన్నందున ఆమెకు సుప్రీంకోర్టు అవకాశం దక్కలేదని కొందరు చెబుతారు.

అయితే ఇపుడు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని కొలీజియం ఆమె పేరును సిఫార్సు చేసినందున, ఆమె సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  2017లో జస్టిస్ నాగరత్న ప్రధాన న్యాయమూర్తి అయితే,  ఒకే కుటుంబం నుంచి రెండవ ప్రధాన న్యాయమూర్తి అయిన కీర్తి ఆమె లభిస్తుంది. ఇలా జరగడం SC చరిత్రలో రెండవసారి.

మొదటి సారి ఘనత కుటుంబం జస్టిస్ వైవీ చంద్ర చూడ్  కుటుంబానిది. 1978 ఫిబ్రవరి నుంచి జులై 1985 వరకు, ఏడు సంవత్సరాలు, చీఫ్ జస్టిస్ గా ఉన్న వైవీ చంద్ర చూడ్ కుమారుడు జస్టిస్ డి వై చంద్ర చూడ్ నవంబర్ 2022 న చీఫ్ జస్టిస్ అవుతున్నారు. జస్టిస్ రమణ రిటైర్ కాగానే చంద్ర చూడ్ బాధ్యతలు స్వీకరిస్తారు.

ఈ సారి అయిదుగురు న్యాయమూర్తులు కొలీజియం ముగ్గురు మ‌హిళా న్యాయ‌మూర్తులతో స‌హా 9 మంది పేర్లను సిఫార్సు చేసింది.

ఇందులో  తెలంగాణ హైకోర్టు సీజే జ‌స్టిస్ హిమా కోహ్లి, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది పేర్లు కూడా ఉన్నాయి. ఇక మిగతావారికి సంబంధించి, మ‌ద్రాస్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎంఎం సుంద‌రేశ్,  క‌ర్ణాట‌క హైకోర్టు సీజే ఎస్ ఓకా, సిక్కిం హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ జేకే మ‌హేశ్వ‌రి, కేర‌ళ హైకోర్టు సీజే పీటీ ర‌వికుమార్, క‌ర్ణాట‌క హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ నాగార్జున, సీనియ‌ర్ న్యాయ‌వాది పీఎస్ న‌ర‌సింహ పేర్లు జాబితాలో ఉన్నాయి.

సుప్రీంకోర్టులో మొత్తం 10 జ‌డ్జిల‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2019, సెప్టెంబ‌రు నుంచి జ‌డ్జిల నియామ‌కాలు జ‌ర‌గ‌లేదు. 22 నెలల తర్వాత జస్టిస్ రమణ నేతృత్వంలోని కొలిజీయం ఖాళీలను పూరించేందుకు పేర్లను సిఫార్సు చేసింది. 9 మంది పేర్లు ఖరారయితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33 కు చేరుతుంది.

సుప్రీంకోర్టులో ఉన్న మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ 2022, సెప్టెంబరులో రిటైర్ కానున్నారు. సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిది మంది మహిళ‌లు న్యాయ‌మూర్తులుగా పనిచేశారు.

2009లో కొంతమంది న్యాయవాదులు కోర్టులోబంధించిన ఇద్దరు న్యాయమూర్తులలో జస్టిస్ రత్న ప్రభ ఒకరు. ఆ సయమలో ఆమె నిగ్రహంతో వ్యహరించిన తీరు ప్రశంసలందుకుంది. బందీలయినందుకు కోపపడటంలేదు, కాకపోతే, ఈ పని చేసింది న్యాయవాదలన్నపుడే బాధ వేస్తుందని, సిగ్గుతో తలదించుకోవలసి వస్తున్నదని వ్యాఖ్యానించారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *