నిరుద్యోగుల కోసం వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు షర్మిళ వారం వారం నిరాహార దీక్ష అని ప్రతి మంగళవారం ఒక వూర్లో నిరాహారదీక్ష జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం గూడూరు మండలంలోని సోమ్లా తండాలోఆమె పర్యటించారు. ఇక్కడ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి సునీల్ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తా అని కుటుంబ సభ్యులకు ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం గుండెంగి గ్రామంలో ఒక రోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు.
దయచేసి నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్య చేసుకోకండని ఈ రోజు ఆమె ట్వీట్ చేశారు.
“మీ పక్షాన నేను నిలబడ్డాను, కొట్లాడుతున్నాను. మీ అక్కగా మీకు అండగా మీ పోరాటాన్ని భూజానేసుకొని ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి నిరాహార దీక్ష చేస్తున్నాను. అధైర్యపడకండి KCR ముక్కుపిండి .. ఉద్యోగ నోటిఫికెషన్స్ ఇప్పిస్తా.KCR గారి కొలువుల ఆటకు తమ్ముడు నగేష్ బలి అయ్యాడు. ఉద్యోగాలపై స్పష్టత లేని హామీలతో రోజుకో విద్యార్థిని చంపుతున్నాడు. ఆగస్టు 15న ఉద్యోగ ఖాళీల భర్తీ పై క్లారిటీ ఇస్తారని ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. అసలు మీకు మనసంటూ ఉందా? ఇంకెంత మంది చనిపోతే నోటిఫికెషన్స్ ఇస్తారు,అని ఆమె ట్వీట్ లో ప్రశ్నించారు.