ఆంధ్రా కు భారీ వర్ష సూచన

దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని వాయువ్య & పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు ఒడిశా తీరం మరియు వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉంది. సంబంధిత ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిమీ వరకు విస్తరించి నైరుతి దిశలో ఎత్తుతో వంగి ఉంటుంది. రానున్న 48 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది.

ఒక ఉత్తర దక్షిణ ద్రోణి ఒడిశా మరియు వాయువ్య బంగాళాఖాతం నుండి ఉత్తర తమిళనాడు వరకు ఉన్న అల్పపీడన ప్రాంతంయొక్క అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ వరకు విస్తరించి ఉంది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :

ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. మరియు భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. మరియు భారీ వర్షాలు విశాఖపట్నం తూర్పు గోదావరి జిల్లాలలో ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. పెనుగాలులు గంటకు 40 నండి 50 కిలోమీటర్లు గరిష్టముగా 60 కిలోమీటర్లు వేగముతో వీస్థాయి.రేపు,ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. పెనుగాలులు గంటకు 40 నండి 50 కిలోమీటర్లు గరిష్టముగా 60 కిలోమీటర్లు వేగముతో వీస్థాయి.ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది ..రేపు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది

రాయలసీమ

రాయలసీమ లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. మరియు భారీ వర్షాలు కర్నూల్ జిల్లాలో ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది .ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం 1లేక 2 చోట్ల చోట్ల కురిసే అవకాశం ఉంటుంది .

— సంచాలకులు,అమరావతి వాతావరణ కేంద్రము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *